ఆదిత్య 369 రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

Nandamuri Balakrishna's Aditya 369 Re Release Date Announced

లెజెండరీ యాక్టర్ నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు చిరునామా. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ ‘ఆదిత్య 369’ NBK ఐకానిక్ చిత్రాలలో ఒకటి. శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. బాలయ్య సరసన మోహిని కథానాయికగా నటించగా, అమ్రిష్ పురి, టిన్ను ఆనంద్, అన్నపూర్ణ, సుత్తివేలు, శ్రీలక్ష్మి, మాస్టర్ తరుణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారతీయ సినిమా పరిశ్రమలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో తొలిసారిగా తెరకెక్కిన మూవీగా కూడా నిలిచి చరిత్ర సృష్టించింది. టెక్నాలజీ అంతగా తెలియని కాలంలో, దాదాపు 35 ఏళ్ల క్రితమే టైమ్ మెషీన్, టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ మూవీ రూపొందడం విశేషం. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. ఇసైజ్ఞాని ఇళయరాజా అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి.

1991లో విడుదలైన ఈ సినిమా తెలుగు చిత్రాలలో ఎవర్ గ్రీన్ క్లాసిక్‌. ఇప్పుడు ఈ చిత్రం మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కొనసాగుతోన్న ట్రెండ్‌కి అనుగుణంగా ఆదిత్య 369 త్వరలో రీరిలీజ్‌కి సిద్ధమైంది. దీనిని నిర్మించిన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానరే మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తోంది. ఏప్రిల్ 11న ఈ సినిమా లేటెస్ట్ 4K టెక్నాలజీతో, నూతన హంగులతో ఆడియెన్స్‌ని అలరించేందుకు ముస్తాబైంది.

ఇకఇదిలావుంటే, మరోవైపు ఆదిత్య 369కి సీక్వెల్ చేయాలని నందమూరి అభిమానులు కూడా ఎప్పటినుంచో కోరుతున్నారు. మరోవైపు బాలయ్య కూడా దీనికోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒకదశలో దర్శకుడు సింగీతంతో దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి. కానీ ఇవేవీ ముందుకు సాగలేదు. అయితే ఇన్నాళ్లకు ఈ కల్ట్ క్లాసిక్‌కి సీక్వెల్‌ రెడీ అవుతోంది.

ఇటీవలే ఒక ఎక్సయిటింగ్ డెవలప్‌మెంట్‌లో భాగంగా ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్ సందర్భంగా బాలకృష్ణ ఆదిత్య 369కి సీక్వెల్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని ‘ఆదిత్య 999 మ్యాక్స్’ అనే పేరుతో తెరకెక్కించనున్నట్టు ఆయన అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా దీనికి బాలకృష్ణే స్వయంగా దర్శకత్వం వహించనుండటం విశేషం.

ఇక మరో విశేషమేంటంటే..? ఇందులో బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ లీడ్ రోల్‌లో నటించనుండటం. ప్రస్తుతం బాలకృష్ణ స్క్రిప్ట్‌లో నిమగ్నమై ఉన్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ టైమ్-ట్రావెల్ సాగాలో నెక్స్ట్ చాప్టర్ కోసం అభిమానుల్లో ఎక్సయిట్‌మెంట్‌ని క్రియేట్ చేసింది. కాగా ఈ సీక్వెల్ మోడరన్ సినిమాటిక్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేస్తూ ట్రెండ్ సెట్టింగ్ లెగసీని ముందుకు తీసుకెళ్లనుంది.

ఆదిత్య 369 కథ ఏంటంటే..?

కృష్ణ కుమార్ (బాలకృష్ణ), హేమ (మోహిని) ప్రేమికులు. హేమ తండ్రి రామ్ దాస్ (టిన్ను అనంద్) ఒక సైంటిస్ట్. కాలంతో పాటు ప్రయాణం చేయగలిగే టైమ్ మెషీన్‌ని తయారు చేయాలని ఆయన ఆశయం. దీంతో అతను ఎప్పుడూ రకరకాల ప్రమోగాలు చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో రామ్ దాస్ అనేకసార్లు విఫలమవుతాడు. ఈ తరుణంలో కొత్తగా మరో మెషీన్‌ని రూపొందిస్తాడు. కానీ, ఇది ఇంకా ప్రయోగదశలోనే వుంటుంది.

ఇదిలాసాగుతుంటే, మరోవైపు హైదరాబాద్ లోని ప్రముఖ మ్యూజియంలో ఉండే అరుదైన వజ్రాన్ని దొంగిలించడానికి రాజా వర్మ (అమ్రిష్ పురి) బృందం ప్రయత్నిస్తుంది. దీనిని ఒక బాలుడు చూస్తాడు. దీంతో ఆ బాలుడిని చంపేందుకు చూస్తుంటారు విలన్ గ్యాంగ్. అయితే ఆ బాలుడు కృష్ణ కుమార్‌కి పరిచయం ఉండటంతో విషయం అతడికి తెలుస్తుంది. కృష్ణ కుమార్‌ దొంగల బారినుంచి పిల్లవాడిని కాపాడుతుంటాడు.

ఈ క్రమంలో ఒకసారి ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి హేమ ఇంటికి వస్తాడు. అక్కడ వారు ఆడుకుంటూ రామ్ దాస్ కొత్తగా తయారుచేసిన టైమ్ మెషీన్‌ ఎక్కుతారు. అనుకోకుండా కొన్ని బటన్లు నొక్కడంతో అది యాక్టివేట్ అవుతుంది. దీంతో వారిని హీరో, హీరోయిన్స్ ఇద్దరూ మెషీన్ లోపలకి వెళ్లి పిల్లలను కాపాడతారు.

కానీ, వారు అందులోనే చిక్కుకుపోతారు. ఇక్కడినుంచి వాళ్లిద్దరూ గతంలోకి అంటే, (శ్రీకృష్ణ దేవరాయల కాలానికి) వెళ్తారు.. ఆ తర్వాత భవిష్యత్ లోకి వెళ్తారు. అప్పుడు ఆ వజ్రాన్ని దోచుకోవాలనుకునే వ్యక్తి ఎవరో ముందుగానే తెలుసుకుంటారు. అలా భవిషత్తు గురించి ముందుగా తేలుసుకున్న తర్వాత ఆ విలువైన వజ్రాన్ని కృష్ణ కుమార్ ఎలా కాపాడుతాడు? అనేది మిగతా కథ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.