తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఓజి సంభవం అంటూ వచ్చిన ఈ సాంగ్ ఆకట్టుకుంది.అయితే కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయ్యింది. తెలుగు వెర్షన్ త్వరలోనే రానుంది.ఈసినిమాను మార్క్ ఆంటోని ఫేమ్ అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈసినిమాతో మైత్రి కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది.తమిళనాడు లో ఈసినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను తెచ్చుకోవడం ఖాయం గా కనిపిస్తుంది.దాదాపు అక్కడ సోలోగా రిలీజ్ అవుతుంది. తెలుగులో మాత్రం పోటీ ఎదురుకానుంది.ఏప్రిల్ 10న ఈసినిమా విడుదలకానుండగా అదే రోజున జాట్ ,జాక్ కొంచెం క్రాక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంతో పోటీ తప్పేలా లేదు.
గుడ్ బ్యాడ్ అగ్లీ లో త్రిష హీరోయిన్ గా నటించగా సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈసినిమాతో అజిత్ కం బ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.గత కొన్నేళ్ల నుండి అజిత్ కు సరైన హిట్ పడలేదు.రీసెంట్ గా విడా ముయార్చి తో రాగ అది కూడా నిరాశపరిచింది.మరి ఈసినిమాతోనైనా హిట్ కొట్టి అజిత్ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: