ఎవడే సుబ్రహ్మణ్యం.. లవ్ ఎటాచ్‌మెంట్ వున్న రేర్ ఫిల్మ్

Director Nag Ashwin Excited on Yevade Subramanyam Re Release

‘ఎవడే సుబ్రహ్మణ్యం ఒక లవ్ ఎటాచ్మెంట్ వున్న అరుదైన సినిమా. పదేళ్లకు ముందు ఎంత రెలెవెంట్ గా ఉండేదో ఇప్పటికీ సినిమా అంతే రెలవెంట్ గా ఉంటుందని భావిస్తున్నాను. సినిమాకి ఇప్పుడు ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది. రీరిలీజ్ లో సినిమాని ఎంతమంది చూస్తారో అందులో టెన్ పెర్సెంట్ ఆడియన్స్ బెటర్ గా ఫీల్ అయితే, ఒక చిన్న పాజిటివిటీ సినిమా వాళ్లకి ఇస్తే థట్స్ గ్రేట్’ అని అన్నారు విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతు వర్మ కీలక పాత్రల పోషించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకుంది. ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. చాలా పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్లు రావచ్చు. కానీ కొన్ని సినిమాలు తోనే ఒక లవ్, అటాచ్మెంట్ ఉంటుంది. తెలుగు ఫిలిం హిస్టరీలో నాకు ఒక మూడు, నాలుగు సినిమాలు అలా ఉంటాయి. ఎవరైనా ఫ్యాన్స్ కనిపించినప్పుడు, సినిమా గురించి మాట్లాడినప్పుడు అలాంటి లవ్ అటాచ్మెంట్ ఉన్న సినిమా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనిపిస్తుంది.”

“పదేళ్ల క్రితం ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అదొక చిన్న రిలీజ్ అనే చెప్పాలి. అందరం కొత్త వాళ్ళం. నా ఫస్ట్ ఫిల్మ్. స్వప్న, ప్రియాంక కూడా అప్పుడప్పుడే వచ్చారు. నాని ఇంత మ్యాసీవ్ అవ్వలేదు. విజయ్ దేవరకొండ డెబ్యు. ఆ సమ్మర్ మంత్ లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయింది. బాగా ఆడింది. వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది.”

“కానీ ఇప్పుడు రిలీజ్ అయితే వచ్చినంత రీచ్ అప్పుడు వచ్చిందని అనుకోవడం లేదు. ఒక పదేళ్ళ తర్వాత ఈ జనరేషన్ వాళ్లు కూడా ఈ సినిమాను చూసి ఎంతో కొంత బెనిఫిట్ పొందుతారనే ఆలోచన ఎప్పటినుంచో ఉండేది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ప్రపంచమే మారలేదు. సుబ్బు ఇంకా పవర్ఫుల్ అయ్యాడనిపిస్తుంది. మనం ఇంకా అదే టార్గెట్స్ వైపు పరిగెడుతున్నాం. అవే గోల్స్ వెనుక పరిగెడుతున్నాం. పదేళ్లకు ముందు ఎంత రెలెవెంట్ గా ఉండేదో ఇప్పటికీ సినిమా అంతే రెలవెంట్ గా ఉంటుందని భావిస్తున్నాను.”

“సినిమాకి ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ రిలీజ్ లో సినిమాని ఎంతమంది చూస్తారో అందులో టెన్ పెర్సెంట్ ఆడియన్స్ బెటర్ గా ఫీల్ అయితే, ఒక చిన్న పాజిటివిటీ సినిమా వాళ్లకి ఇస్తే థట్స్ గ్రేట్. సినిమాని ఇప్పుడు మంచి బ్యాండ్ విత్ లో రిలీజ్ చేస్తున్నాం. సినిమాని ఇప్పుడు మరింతమంది ఎక్స్పీరియన్స్ చేస్తారని భావిస్తున్నాను. ఇంద్ర రీరిలీజ్ కి ఎంత సపోర్ట్ చేశారో ఈ సినిమాకి కూడా అలాంటి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.