పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఆయన కెరీర్ అద్భుతంగా సాగిపోతోంది. సలార్, కల్కి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేంటంటే..? ప్రభాస్ నటించిన ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ చిత్రం మళ్ళీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 21న సలార్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో స్పెషల్ షోలుగా ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఒక సాలిడ్ అప్డేట్ అందింది. సలార్ డైరెక్ట్ రిలీజ్ టైంలో దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ సాధించింది.
ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్‌లో సైతం అదే జోరు చూపిస్తూ రికార్డ్ వసూళ్లు కళ్లజూస్తోంది. ఇప్పటికే రూ.1కోటికి పైగా కలెక్షన్స్ సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. అయితే సలార్ మూవీ ఇదే తొలిసారి కాదు, ఇంతకుముందు రెండుసార్లు రీ-రిలీజ్ అయింది. గతేడాది అక్టోబర్ నెలలో ప్రభాస్ జన్మదినం సందర్భంగా కూడా రీ రిలీజ్ అయిన విషయం గుర్తుండేవుంటుంది.
అయినాసరే, ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదిరిపోయే వసూళ్లు అందుకోవడం విశేషం. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మార్చి 21న ప్రభాస్ అభిమానులందరూ ఈ చిత్రాన్ని వీక్షించేందుకు రావాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా వారు పోస్టులు పెడుతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: