తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్షన్ లో రీసెంట్ గా వచ్చిన సినిమా నిలువుకు ఎన్మేల్ ఎన్నడీ కోబం (నీక్).ఇందులో ధనుష్ మేనల్లుడు పవిష్ ,అనికా సురేంద్రన్ లీడ్ రోల్స్ లో నటించగా వెంకటేష్ మీనన్ ,సిద్దార్థ శంకర్ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,రమ్య రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు.ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లతో హిట్ అనిపించుకుంది.అయితే ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ కూడా అదే టైం లో రిలీజ్ కావడంతో నీక్ కు రావాల్సినంత రెస్పాన్స్ రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.ఈనెల 21న ప్రైమ్ వీడియో నీక్ ను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.కేవలం తమిళ భాషలో అందుబాటులోకి రానుంది.మరి మిగితా భాషల్లో ఎప్పడు స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ రావాల్సివుంది.ఇక ఈసినిమా తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా గా విడుదలైంది.అయితే తెలుగులో కూడా డ్రాగన్ హావ కొనసాగించడం తో జాబిలమ్మను పెద్దగా పట్టించుకోలేదు.ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను తెలుగులో విడుదలచేసింది.
ఇక ధనుష్ ప్రస్తుతం హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.అందులో భాగంగా తెలుగులో కుబేర లో నటిస్తున్నాడు.ఇందులో రష్మిక హీరోయిన్ కాగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నాడు.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఇది కాకుండా తమిళంలో ధనుష్ ఇడ్లీ కడాయిలో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు.అలాగే హిందీ లో తేరే ఇష్క్ మే అనే సినిమాకూడా చేస్తున్నాడు.ఆనంద్ ఎల్ రాయ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా కృతి సనన్ హీరోయిన్ గా చేస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: