యంగ్ హీరో శర్వానంద్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు.ప్రస్తుతం అతని చేతిలో మూడు సినిమాలు వున్నాయి.అందులో రెండు సెట్స్ మీద ఉండగా మరొకటి ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.అదే సంపత్ నంది తో చేయనున్న 38వ సినిమా.యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.ఇక ఈసినిమాకు హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.ఇందులో అనుపమ పరమేశ్వరన్,శర్వా కు జంటగా నటించనుంది.ఇంతకుముందు వీరిద్దరు కలిసి శతమానం భవతి లో నటించారు.ఆసినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మళ్ళీ కలిసి నటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించనుండగా భారీ బడ్జెట్ తో కె కె రాధామోహన్ నిర్మిస్తున్నారు.ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ కానుంది.కుదిరితే ఈ ఏడాదే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాల్లో నారీ నారీ నడుమ మురారి ఒకటి.సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక శర్వానంద్ ప్రస్తుతం తన 36వ సినిమాలో కూడా నటిస్తున్నాడు.అభిషేక్ కంకర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా యువీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.ఇది కూడా ఈ ఏడాదే విడుదలకానుంది.సో శర్వానంద్ ఈ ఏడాది మూడు సినిమాలతో రానున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: