నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ వీక్ డేస్ లో సాలిడ్ గా హోల్డ్ చేస్తూ సూపర్ వసూళ్లను రాబట్టుకుంటుంది. సోమవారం 4కోట్ల గ్రాస్ రాబట్టిన ఈసినిమా మంగళవారం మరో 4కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది. దాంతో 5రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 33 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం వేరే సినిమాలతో పోటీ లేకపోవడం మౌత్ టాక్ సూపర్ గా ఉండడంతో కోర్ట్ థియేటర్లలో డ్రీం రన్ కనబరుస్తుంది.రాబిన్ హుడ్ ,మ్యాడ్ స్క్వేర్ వచ్చే వరకు కోర్ట్ ఇదే రన్ ను కొనసాగించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుని బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుంది.నిన్నటి వరకు అక్కడ 800K డాలర్లను కలెక్ట్ చేసింది. ఈ వారం లో మిలియన్ క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో కోర్ట్ 50 కోట్ల క్లబ్ లో చేరనుంది. ఇక నాని ఈసినిమాను చాలా బాగా ప్రమోట్ చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోర్ట్ నచ్చకుంటే హిట్ 3 చూడకండి అని స్టేజ్ మీదే చెప్పేశాడు.అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి రిలీజ్ కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లు కూడా వేశాడు.రిలీజ్ కు ముందు ఇవ్వన్నీ ప్లస్ అయ్యాయి.
పోక్సో యాక్ట్ నేపథ్యంలో కొత్త డైరెక్టర్ రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రధాన పాత్రల్లో నటించగా శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, కీలక పాత్రలు పోషించారు.ఇందులో ముఖ్యంగా శివాజీ పోషించిన మంగపతి పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి.విజయ్ బుల్గానిన్ సంగీతం ఈసినిమాకు అందించగా నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: