ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న 22వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.అందులో భాగంగా గత కొన్ని రోజుల నుండి ఈసినిమా రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకోగా నిన్నటి తోఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. 34 రోజుల పాటు జరిగిన ఈషెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తోపాటు కీలక సన్నివేశాలను అలాగే రెండు పాటలను చిత్రీకరించారు. షార్ట్ బ్రేక్ తరువాత నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది.గోదావరి బ్యాక్ డ్రాప్ లో క్యూట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ఈఏడాది ద్వితీయార్థంలో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.రామ్ బర్త్ డే మే 15న ఈసినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నారు.
ఇక ఈసినిమా విజయం రామ్ కు తప్పనిసరి కానుంది.ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ కు సాలిడ్ హిట్ పడలేదు.గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ తో రాగ ఆ సినిమా భారీ షాక్ ఇచ్చింది.ఇక ఈసారి ఎలాగైనా రామ్ ఈ 22వ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.ఈసినిమా తరువాత రామ్ ఇప్పటివరకు మరో సినిమాకు కమిట్ అవ్వలేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: