స్టార్ హీరో నాని నిర్మాణంలో వచ్చిన కోర్ట్ :ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.సూపర్ మౌత్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ సెన్సేషనల్ వసూళ్లను సొంతం చేసుకున్న ఈసినిమా వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇచ్చి జోరు కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా సూపర్ హోల్డ్ ను కొనసాగించి 4కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో నాలుగు రోజుల్లో కోర్ట్ ప్రపంచ వ్యాప్తంగా 28.9కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కావడంతో భారీ లాభాలను తీసుకొస్తుంది. ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్ లో 50 కోట్ల మార్క్ చేరాలనే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా అటు ఓవర్సీస్ లోనూ హిట్ అనిపించుకుని బ్లాక్ బస్టర్ గా దిశగా సాగుతుంది. నిన్నటి వరకు 700K డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది. ఈవారంలో వన్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.నాని బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాల్లోకెల్లా కోర్ట్ హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించనుంది. అయితే మే లో రానున్న హిట్ 3 ఈ రికార్డు ను బ్రేక్ చేయనుంది.ఈసినిమాను నాని నటిస్తూ నిర్మిస్తున్నాడు.ఓవరాల్ గా చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.
కొత్త దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రధాన పాత్రల్లో నటించగా శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు.ఇందులో శివాజీ పోషించిన పాత్రకు ప్రశంసలు దక్కుతున్నాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా నాని తోకలిసి ప్రశాంతి తిపిర్నేని ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: