లవ్ టుడే తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే 100 కోట్లు కొట్టాడు తమిళ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్.ఈసినిమాకు తనే డైరెక్టర్ కూడా.ఇక దీని తర్వాత హీరోగా చేసిన సినిమా డ్రాగన్. రీసెంట్ గా విడుదలైన ఈసినిమా 100 కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.తెలుగులో ఈసినిమా రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా విడుదలై 20 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.నెట్ ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను దక్కించుకోగా ఈనెల 21న అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.దాంతో ఓటిటి లోనూ ఈసినిమా అదరగొట్టనుంది.అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ ,కయదు లోహర్ హీరోయిన్లు గా నటించగా లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.టాప్ ప్రొడక్షన్ హౌస్ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది.
ఈసినిమాతో ప్రదీప్ రంగనాథ్ వరుసగా రెండో సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.వరుసగా రెండు సార్లు ఈ ఫీట్ సాధించడంతో ప్రదీప్ కోలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు.
ఇక నెక్స్ట్ ఈ హీరో ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) తో రానున్నాడు.విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈసినిమాతో హ్యాట్రిక్ కొడతాడో చూడాలి.ఈసినిమా తోపాటు ప్రస్తుతం మైత్రి మూవీస్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రదీప్.కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేస్తున్నాడు.త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: