లెజెండరీ మ్యూజిక్ కంపోజర్, ‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ”మోదీజీతో ఈ భేటీ నాకు చిరస్మరణీయమైనది. నా ‘సింఫొనీ-వాలియంట్’ సహా పలు అంశాల గురించి ఇరువురం చర్చించాం. ఆయన ప్రశంసలు, మద్దతుకి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అందులో తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ కూడా తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు. “మన సంగీతం మరియు సంస్కృతిపై అమోఘమైన ప్రభావాన్ని చూపిన సంగీత దిగ్గజం, రాజ్యసభ ఎంపీ తిరు ఇళయరాజా జీని కలవడం ఆనందంగా ఉంది. ఆయన ప్రతి కోణంలోనూ ఒక మార్గదర్శకుడు.”
“కొన్ని రోజుల క్రితం లండన్‌లో తన మొట్టమొదటి పాశ్చాత్య శాస్త్రీయ సింఫొనీ, వాలియంట్‌ను ప్రదర్శించడం ద్వారా ఆయన మరోసారి చరిత్ర సృష్టించారు. ఈ ప్రదర్శన ప్రపంచ ప్రఖ్యాత రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి జరిగింది. ఈ చిరస్మరణీయ ఘనత ఆయన అసమానమైన సంగీత ప్రయాణంలో మరో అధ్యాయాన్ని సూచిస్తుంది – ఇది ప్రపంచ స్థాయిలో శ్రేష్ఠతను పునర్నిర్వచించడం కొనసాగిస్తోంది.” అని ప్రధాని మోదీ అందులో పేర్కొన్నారు.
కాగా ఇళయరాజా ఇటీవల లండన్‌లో ‘వాలియంట్’ పేరుతో సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. తద్వారా వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీని ప్రదర్శించిన తొలి ఆసియా సంగీత దర్శకుడిగా ఆయన అరుదైన రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమం తర్వాత చెన్నై చేరుకున్న ఇళయరాజా, మీడియాతో తన వాలియంట్ గురించి పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఈ ‘వాలియంట్’ను 13 దేశాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: