మచ్ అవైటెడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ మరో 10రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో టీం నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చింది.ట్రైలర్ రావాల్సివుంది. సాంగ్స్ కూడా బాగున్నాయ్. ఫస్ట్ పార్ట్ లోలాగే కామెడీ వర్క్ అవుట్ అయితే మ్యాడ్ స్క్వేర్ ఈజీగా 50కోట్ల క్లబ్ చేరనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రన్ టైం కూడా లాక్ చేశారు. టైటిల్ కార్డు తో కలిపి కేవలం 2 గంటల 7నిమిషాల రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.మరి ఇంత తక్కువ రన్ టైంతో వస్తున్న సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఫస్ట్ పార్ట్ లో నటించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్ ,రామ్ నితిన్ , విష్ణు ఓయ్ ఈ సీక్వెల్ లో లీడ్ రోల్స్ లో నటించగా కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేశాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సూర్యదేవర హారిక ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇక ఈసినిమాకు పోటీ ఎదురుకానుంది.మార్చి 28న నితిన్ రాబిన్ హుడ్ కూడా రిలీజ్ అవుతుంది.నిజానికి రాబిన్ హుడ్ ముందు ఆ డేట్ ను లాక్ చేసుకుంది. ఆ తరువాత మ్యాడ్ స్క్వేర్ 29 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.అయితే డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు మ్యాడ్ స్క్వేర్ ఒక రోజు ముందుగా రిలీజ్ అవుతుంది. రాబిన్ హుడ్ పై కూడా మంచి అంచనాలే వున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: