టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. అయితే గత కొంతకాలంగా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్న పూరి ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే తన తదుపరి ప్రాజెక్టుని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని యోచిస్తున్నాడు. దీంతో తాను తీయబోయే సినిమాలో స్టార్ క్యాస్టింగ్‌ని ఎంచుకోనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా అన్ని భాషల్లో సుపరిచితుడైన హీరోని తన కథానాయకుడి పాత్రకు తీసుకోనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఓ తమిళ స్టార్ హీరో ఇందులో నటించనున్నట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు, ‘మక్కళ్ సెల్వన్’ విజయ్ సేతుపతి. తొలినుంచీ విభిన్న కథాంశాలు, పాత్రలను ఎంచుకొంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తెలుగువారికి బాగా పరిచయమున్న నటుడే.
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా వచ్చిన ‘ఉప్పెన’ సినిమాలో తనదైన విలనిజంతో భయపెట్టాడు విజయ్ సేతుపతి. అయితే అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన హిస్టారికల్ మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో మెరిశాడు. అలాగే సేతుపతి నటించిన ‘మహారాజ’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే అందుకుంది. ఇలా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఫేస్ కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక మరోవైపు పూరి జగన్నాథ్ ప్రస్తుతం అంతగా ఫేమ్ లో లేకున్నా.. ఆయనను తక్కువ అంచనా వేయడానికి లేదు. తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే విజయ్ సేతుపతి పూరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ డాషింగ్ డైరెక్టర్ చెప్పిన కథ విధానం, కాన్సెప్ట్ కొత్తగా ఉండటం, తన పాత్రను డిజైన్ చేసిన తీరు.. ఇవన్నీ బాగా నచ్చడంతో ఆయన వెంటనే అంగీకరించారని అంటున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రావొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: