కల్కి 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..?

Director Nag Ashwin Gives Interesting Update About Kalki 2

నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్, రీతు వర్మ కీలక పాత్రల పోషించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకుంది. ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్యూ అండ్ ఏ సెషన్ లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాగ్ అశ్విన్ సమాధానాలు ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అప్పటికి, ఇప్పటికీ ఈ సినిమా మీద మీకున్న లవ్ ఏమిటి ? ఇపుడు సినిమా చూసినప్పుడు ఏం అనిపిస్తుంది?

  • ఫస్ట్ మూవీ మన ఫస్ట్ చైల్డ్ లాంటిది.
  • మరీ ఎక్కువగా ఆలోచించడం ఉండదు.
  • ఇమ్మెచ్యుర్ గా వున్నప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది.
  • అది ఇంకా సినిమాలో కనిపిస్తుంది.

ఎవడే, మహానటి, కల్కి ఈ మూడిట్లో మీ బెస్ట్ అంటే ఏం చెప్తారు?

  • మళ్ళీ ముగ్గురు పిల్లలు పోలిక తీసుకురావాలి (నవ్వుతూ).
  • అయితే ‘మహానటి’ సినిమా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది.
  • కారణం.. ఆ సినిమాకి చాలా టైం దొరికింది.
  • సినిమాని ఫైన్ ట్యూన్ చేసుకునే టైం దొరకడంతో ఒక సాటిస్ఫాక్షన్ దొరికింది.

‘ఎవడే’ అన్ని నేచురల్ లొకేషన్స్‌లో చేశారు కానీ మిగతా రెండు సినిమాలు ఎక్కువగా సెట్స్ లో చేయడానికి కారణం?

  • ఏదైనా కథ ప్రకారం ఉంటుంది.

కల్కి 2 సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?

  • ప్రిపరేషన్ జరుగుతుంది.
  • ఇయర్ ఎండింగ్‌లో ఉండొచ్చు.

ఈ పదేళ్లలో మూడు సినిమాలే తీయడానికి కారణం?

  • ఏదైనా ప్రాజెక్ట్ ని బట్టి వుంటుంది.
  • కల్కి లాంటి సినిమాని రెండేళ్లలో తీయలేం.
  • దాని స్కేలు, స్టార్ కాస్ట్, వాళ్ళ డేట్స్, సిజీ వర్క్.. వీటన్నిటికీ చాలా టైం కావాలి.

మీ ఫస్ట్ సినిమాకి కమర్షియల్ ఎలిమెంట్స్ చూడకుండా ‘ఎవడే’ కథని ఎంచుకోవడానికి కారణం?

  • నిజానికి ఒక రెండు కమర్షియల్ అనుకునే కథలు రాశాను.
  • వైజయంతికి కూడా చెప్పాను. కానీ అవి టేక్ ఆఫ్ కాలేదు.
  • అలాంటి సమయంలో ఒక చిన్న ఇండిపెండెంట్ ఫిలిం చేద్దామని ‘ఎవడే’ ఆలోచనతో రాయడం మొదలుపెట్టాను.
  • నిజానికి ఈ సినిమాని ఎవరూ ప్రొడ్యూస్ చేస్తారని అనుకోలేదు.
  • కానీ ఇది నానికి, స్వప్నకి, ప్రియాంకకి అందరికి నచ్చింది.
  • వాళ్ళకి నచ్చడంతో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది.

ఈ పదేళ్లలో కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నారా?

  • చాలా హ్యాపీగా ఉన్నాను.
  • చేసే ప్రతి సినిమా మరొకరు చేయలేని కాన్సెప్ట్ తోనే వెళుతున్నాను.
  • అవన్నీ కూడా సక్సెస్‌ఫుల్ సినిమాలు అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.

ఎవడే సుబ్రహ్మణ్యంకి సీక్వెల్ ఉంటుందా?

  • ఎవడే సుబ్రహ్మణ్యంకు సీక్వెల్ చేయలేం.
  • ఇంటర్వెల్ లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు.
  • అయితే దీనికి ప్రీక్వెల్ రాయొచ్చు.

మీ సెకండ్, థర్డ్ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించారు. నానితో మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారు?

  • చేయాలని అనుకున్నాం. వర్కౌట్ కాలేదు.
  • బట్, ఫ్యూచర్ లో డెఫినెట్ గా వర్కౌట్ చేస్తాం.

ఈ సినిమాలో ప్రత్యేకంగా కృష్ణంరాజు గారినితీసుకోవాలని ఎందుకు అనిపించింది?

  • ఆ క్యారెక్టర్ లో కృష్ణంరాజు గారు ఉంటే బాగుంటుందని అనిపించింది.
  • ఆయన ‘అవతారం’ అని ఒక సినిమా చేశారు.
  • అందులో ఆయన లుక్కు నాకు చాలా నచ్చింది.
  • ఇందులో చాలా బలమైన లైన్స్ ఉంటాయి.
  • అలాంటి మాటలు చెప్పే అర్హత ఆయనకి ఉందనిపించింది.

ప్రతిష్టాత్మకమైన వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రొజెక్ట్స్ హ్యాండిల్ చేయడం ఎలా అనిపిస్తుంది?

  • కల్కి రిలీజ్ అయ్యే ముందు ఒక ఒత్తిడి ఉండేది.
  • చాలా భారీ పిక్చర్. చాలా బాధ్యత ఉంటుంది.
  • రిలీజ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది.
  • మేము ఒక ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేయగలిగాం.
  • భవిష్యత్తులో మరిన్ని అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ చేయగలమని నమ్మకం వచ్చింది.

రిషి, సుబ్బు ఈ రెండిట్లో మీకు బాగా దగ్గరైన పాత్ర ఏంటి?

  • ప్రతి మనిషిలో రిషి, సుబ్బు రెండు కోణాలు ఉంటాయి.
  • నేను కొన్నాళ్లు రిషి లాగా తిరిగాను. సుబ్బులా కూడా ఉన్నాను (నవ్వుతూ).

ఎవడే సినిమాకి మీరెదురుకున్న టఫ్ ఛాలెంజ్ ఏంటి?

  • రిలీజ్ చాలా టఫ్ అనిపించింది.
  • మాకు అప్పుడు బ్యాండ్ విడ్త్ చాలా తక్కువ.
  • ఫైనల్ కాపీ కూడా సరిగ్గా చూసుకోలేనంత టెన్షన్ ఉండేది.

‘ఎవడే’ని ఆడియన్స్ చాలా ఇష్టపడ్డారు.. ఇలాంటి కాన్సెప్ట్స్ మళ్ళీ ఆలోచిస్తారా?

  • ఇది ఇష్టపడతారని అప్పుడు నాకు తెలియదు.
  • జస్ట్ తీశాను, వర్కౌట్ అయింది. ప్రతి సినిమా అలానే చేస్తాం.
  • ప్రొడ్యూసర్, యాక్టర్స్ అందరం ఇష్టపడి తీస్తాం.
  • అది ఆడియన్స్‌కి నచ్చితే వెరీ హ్యాపీ.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.