మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. దీనిలో భాగంగా ఇప్పటికే మూవీ నుంచి రెండు పాటలు, టీజర్ రిలీజ్ చేయగా వీటికి మంచి స్పందన వచ్చింది. ఇదిలావుంటే, తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ అందింది. ఏప్రిల్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ వంటి ప్రధాన తారాగణం నటిస్తోంది. అలాగే మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పీజీ విందా కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: