కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie Update

ట్యాగ్ · 36 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

డిప్రెషన్ లో ఉన్నప్పుడు రజినీ సినిమాలు చూస్తానంటున్న మాజీ క్రికెటర్

తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ స్థాయిలో అభిమానాలు వున్నారు ఆయనకు. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి కూడా ఆయనకు అభిమానులున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మలేషియా, జపాన్ లాంటి దేశాల్లో ఆయన సినిమాలు రిలీజ్ అయితే అక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేసే స్టామినా ఉన్న నటుడు రజినీకాంత్. సామాన్యులకు.. కేవలం సినిమా వాళ్ళకే కాదు ఎంతోమంది ప్రముఖులకు కూడా ఆయన జర్నీ ఒక స్ఫూర్తిదాయకం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పట్లో.. బాలకృష్ణ సినిమా కోసం చిరు ప్రచారం

ఇప్పుడు ఒక హీరో సినిమా ప్రమోషన్స్ కు మరొక హీరో రావడం కామన్ అయిపోయింది. అందుకు కారణం అప్పటి సినీ పరిశ్రమలో.. ఇప్పటి సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి. అప్పట్లో ఈ ప్రమోషన్స్ అవి ఇవి అంటూ అంత హడావుడి ఉండేది కాదు. సినిమా షూటింగ్ చేశామా.. కష్టపడ్డామా.. సినిమా రిలీజ్ అయ్యిందా.. అదేంటో మరి అప్పుడు ఎలాంటి ప్రచారాలు లేకపోయినా ప్రతి సినిమా దాదాపు హిట్టయ్యేది. ప్లాప్స్ సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఒకరి సినిమాను మరొకరు ప్రమోట్ చేయడం కూడా తక్కువే.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

#PSPK28 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

ఫైనల్లీ పవన్ నాలుగో అప్ డేట్ కూడా వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి కూడా సర్ ప్రయిజ్ ఉన్నట్టు నిన్ననే తెలిపారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే పవన్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుండి కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్ట‌ర్ లో స్టైలిష్ బైక్ క‌నిపిస్తుండ‌గా..దానిపై పెద్ద బాలశిక్ష పుస్త‌కం..బ్యాక్ డ్రాప్ లో నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్‌, జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ చిత్రాలు క‌నిపిస్తూ దేశ‌భ‌క్తిని స్మృశించేలా ఉంది. హ‌రీష్ శంకర్ కాన్సెప్ట్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కులు, అభిమానుల్లో అంచ‌నాల‌ను మ‌రింత పెంచేస్తుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థమన్ 'బుధవారం' ట్వీట్ 'వకీల్ సాబ్' గురించా..?

రీసెంట్ గానే చిరు పుట్టిన రోజు అయిపోయింది. ఇక చిరు పుట్టిన రోజున కామన్ మోషన్ పోస్టర్, కామన్ డీపీ అంటూ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ బాగానే హడావుడి చేశారు. ఇక ఫ్యాన్స్ కోసం ఆచార్య నుండి ఒక అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కోసం. మరి ఎంత సెలెబ్రేట్ చేయొద్దని చెప్పినా ఫ్యాన్స్ కదా ఏదో ఒక రకంగా తమ హీరోపై అభిమానంతో ఏదో ఒకటి చేస్తారు. అంతేకాదు తన సినిమా నుండి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని అదే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు.

TFN Adminవాట్సాప్
Raju Gari Gadhi 4 To Hit The Floors Soon
సినిమా వార్తలు

త్వరలో "రాజు గారి గది 4 " మూవీ ?

వారాహి చలన చిత్రం , ఏ కె ఎంటర్ టైన్ మెంట్ , ఓక్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో ఓంకార్ సోదరుడు అశ్విన్ బాబు హీరోగా రూపొందిన హారర్ కామెడీ థ్రిల్లర్ "రాజు గారి గది " మూవీ 2015 సంవత్సరం అక్టోబర్ 16 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ సీక్వెల్ "రాజు గారి గది 2" మూవీ పివిపి సినిమా , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ , ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున , సమంత , సీరత్ కపూర్ లతో తెరకెక్కి 2017 సంవత్సరం అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ అయ్యింది.

Team TFNవాట్సాప్
Actress Anupama Parameswaran To Act In Telugu Remake Of Blockbuster Malayalam Movie Helen
సినిమా వార్తలు

మలయాళ మూవీ తెలుగు రీమేక్ లో అనుపమ పరమేశ్వరన్ ?

సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ "ప్రేమమ్ ", "శతమానం భవతి ", "హలో గురు ప్రేమకోసమే ","రాక్షసుడు "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మలయాళ , తమిళ , కన్నడ భాషల మూవీస్ లో నటిస్తున్న అనుపమ ఇప్పుడు వరుస తెలుగు మూవీస్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు. నిఖిల్ హీరోగా రూపొందుతున్న "కార్తికేయ 2 ", "18 పేజెస్ " మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయిన అనుపమ ఇప్పుడు ఒక మలయాళ మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Team TFNవాట్సాప్
Bollywood Actress Kiara Advani To Play The Lead Role In Prabhas Adipurush
సినిమా వార్తలు

"ఆది పురుష్ "మూవీ లో హీరోయిన్ కియారా అద్వానీ ?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా ఒక బాలీవుడ్ మూవీ అనౌన్స్ అయింది. హీరో ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ లో నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
Actress Aditi Rao Hydari To Pair Opposite Natural Star Nani Once Again In Shyam Singha Roy Movie
సినిమా వార్తలు

హీరో నాని కి జోడీగా మరోసారి అదితి రావు హైదరి ?

హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పార్ట్ కొంత మిగిలివున్న ఈ మూవీ తరువాత నాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందనున్న "శ్యామ్ సింగ రాయ్ " మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్ లలో ఒక హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రశాంత్ వర్మ కరోనా సినిమా టైటిల్ రిలీజ్

సినిమా సినిమాకు వైవిధ్యతను చూపిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమా 'అ' సినిమాతోనే తనలోని విభిన్నతను చూపించాడు. రెండో సినిమా కల్కి రాజశేఖర్‌తో చేసి ఆకర్షించారు. ఇక ఇప్పుడు మూడో సినిమాగా గత కొన్ని నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. ఇప్ప‌టికే 40 శాతం పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తుంది‌.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో..?

రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో అభిమానులు పవన్ సినిమా ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా కొద్దిరోజుల్లో వకీల్ సాబ్ సినిమా రాబోతుంది అనుకుంటుండగా ఈలోపు కరోనా రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఇంకా కొద్దిపాటి షూటింగ్ మాత్రమే ఉంది. ఇక ఆ పార్ట్ కూడా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న విరూపాక్ష సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'శ్రీదేవి' సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో 'కీర్తి సురేష్'..?

సూపర్ హిట్ అయిన సినిమాలను ఈ మధ్య సీక్వెల్స్ చేయడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వచ్చే హిట్ సినిమాలకు సీక్వెల్స్ అంటే ఓకే కానీ ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ అంటే ఇప్పుడు కష్టమే. ఇప్పుడు అలాంటి ఒక సినిమానే సీక్వెల్ తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒకటి కాదు రెండు కాదు 42 ఏళ్ళ తర్వాత.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పుడు 'కొడుకు దిద్దిన కాపురం' - 30 ఏళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు'

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

గెలుపు నుండి కాదు ఓటమి నుండి నేర్చుకున్నా..!

అ‍ల్లుడు శ్రీను సినిమాతో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయినా పెద్దగా బ్రేక్‌ రాలేదు. అయితే తమిళ్ సినిమా రాచ్చసన్ సినిమాను తెలుగులో రాక్షసుడు గా రీమేక్ చేసి మొదటిసారిగా సూపర్ హిట్ అందుకున్నాడు. ‘రాక్షసుడు’ హిట్‌ కావడంతో తిరిగి సక్సెస్‌ బాట పట్టాడు. ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకునే పనిలో పడ్డాడు సాయి శ్రీనివాస్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"రాక్షసుడు " మూవీ కి సీక్వెల్ ?

సక్సెస్ ఫుల్ "రైడ్ " మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో A స్టూడియో బ్యానర్ పై బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ "రాక్షసుడు " మూవీ ఘనవిజయం సాధించింది. తమిళ సూపర్ హిట్ మూవీ "రాక్షసన్ " కు తెలుగు రీమేక్ గా ఈ మూవీ రూపొందింది. మాస్ హీరో సాయి శ్రీనివాస్ "రాక్షసుడు " మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"18 పేజెస్ " మూవీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ?

యంగ్ హీరో నిఖిల్ "కార్తికేయ 2", "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరో గా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ "మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ కి సీక్వెల్ "కార్తికేయ 2 " మూవీ లో నిఖిల్ కు జోడీ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'చంద్రముఖి 2' లీడ్ యాక్ట్రెస్ పై లారెన్స్ క్లారిటీ..!

పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ విషయాన్ని స్యయంగా దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ ఇటీవలే ప్రకటించాడు కూడా. ఇక అప్పటినుండి చంద్రముఖి 2 పై రూమర్లు వస్తూనే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్