అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో చాలా ఏళ్ళ తర్వాత విజయశాంతి మళ్ళీ మేకప్ వేసుకున్న సంగతి తెలిసిందే. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ప్రొఫెసర్ భారతి పాత్రలో నటించారు. నిజానికి ఎప్పుడో తన సినిమా కోసం విజయశాంతి గారిని తీసుకురావాలనుకున్నాడు అనిల్. కానీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఆ పవర్ ఫుల్ పాత్ర కోసం ఆమె అయితేనే సరిపోతుందని ఈ సినిమా కోసం పట్టుపట్టి మరీ తీసుకొచ్చాడు.
అనిల్ రావిపూడి. మహేష్ బాబుతో సరిసమానమైన పాత్ర అని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమా కంటే ముందే మన సూపర్ స్టార్ మహేష్ బాబు లేడి సూపర్ స్టార్ విజయశాంతితో కలిసి నటించిన సంగతి తెలిసిందే కదా. మహేష్ చైల్డ్ ఆరిస్ట్ గా చాలా సినిమాల్లోనే నటించాడు. 1989లో కొడుకు దిద్దిన కాపురంలో విజయశాంతిగారితో కలసి నటించాడు. ఆ చిత్రంలో విజయశాంతి, మహేష్ తల్లికొడుకులుగా నటించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ విషయాన్ని అప్పట్లో మహేష్ కూడా గుర్తుచేసుకున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ, విజయశాంతి, మహేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా 1989 సెప్టెంబర్ 21న విడుదలై ఘనవిజయం సాధించింది. `కొడుకు దిద్దిన కాపురం` మహేష్ కు మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. వినోద్, ప్రమోద్‌గా ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై కృష్ణ స్వీయదర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రాజ్-కోటి స్వరాలు అందించారు.
ఇక విజయశాంతి గారి గురించి చెప్పేదేముంది. ఎంతోమంది అగ్రహీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అంతేకాదు ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారి… స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ విజయశాంతి. ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోపక్క సామాజిక దృక్పదం వుండే సినిమాల్లో నటించేవారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: