
ట్యాగ్ · 25 కథనాలు


కిరణ్ మీటర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆడియన్స్ కు హీరో కిరణ్ అబ్బవరం స్పెషల్ థ్యాంక్స్

నన్ను కంగారు పెట్టేది అదే

వినరో భాగ్యము విష్ణు కథ-కిరణ్ కోసం సుప్రీమ్ హీరో

ఒకరోజు వెనక్కి వినరో భాగ్యము విష్ణు కథ

రిలీజ్ అయిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ టీజర్

వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిలీజ్ డేట్ వాయిదా

తనపై కామెంట్స్ కు కిరణ్ సాలిడ్ రిప్లై..!

'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' టీజర్ రిలీజ్

'సమ్మతమే' రిలీజ్ డేట్, ట్రైలర్ అప్ డేట్..!

కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!

'సెబాస్టియన్ P.C 524' ట్రైలర్ రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సెబాస్టియన్ P.C 524'

కిరణ్ అబ్బవరం దిల్ రుబా వచ్చేది అప్పుడే
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్ నటుడు ఇటీవలే 'క' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.

కిరణ్ మీటర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు కిరణ్. ఇక వెంటనే మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా వస్తున్న సినిమా మీటర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్న ఈసినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్ 7వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ…

ఆడియన్స్ కు హీరో కిరణ్ అబ్బవరం స్పెషల్ థ్యాంక్స్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 18వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం తన ఈజ్ యాక్టింగ్ తో అండ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ లో శుభలేఖ సుధాకర్ , మురళీ శర్మ, ప్రవీణ్, ఎల్ బి శ్రీరామ్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

నన్ను కంగారు పెట్టేది అదే
మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి.

తారక్ మాడ్యులేషన్ అంటే ఎంతో ఇష్టం - కిరణ్ అబ్బవరం
సక్సెస్ ఫుల్ రాజా వారు రాణి గారు (2019)మూవీ తో కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయం అయ్యారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన ఎస్.ఆర్. కల్యాణ మండపం మూవీ ఘనవిజయం సాధించి కిరణ్ ను కమర్షియల్ హీరోగా పరిచయం చేసింది. సూపర్ హిట్ సమ్మతమే తో కిరణ్ ప్రేక్షకులను అలరించారు. పలు మూవీ ఆఫర్స్ తో కిరణ్ బిజీగా ఉన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ రిలీజ్ కానుంది.

వినరో భాగ్యము విష్ణు కథ-కిరణ్ కోసం సుప్రీమ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో విలేజ్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సస్పెన్స్, లవ్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండబోతుందని టీజర్లో చూపించారు.

ఒకరోజు వెనక్కి వినరో భాగ్యము విష్ణు కథ
ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయ్యాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

రిలీజ్ అయిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ టీజర్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీతో పాటు కిరణ్ అబ్బవరం హీరోగా పలు మూవీస్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

వినరో భాగ్యము విష్ణుకథ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు వినరో భాగ్యము విష్ణుకథతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ఇటీవలే ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

వినరో భాగ్యము విష్ణు కథ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలానికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. ఇక ఇటీవలే కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

నేను మీకు బాగా కావాల్సిన వాడిని రిలీజ్ డేట్ వాయిదా
రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా కూడా ఒకటి. శ్రీధర్ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇంకా రిలీజ్ కు చాలా తక్కువ రోజులు ఉండటంతో ఈసినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రీసెంట్ గానే ఈ సినిమా నుండి ఒక లిరికల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్రం బృందం. ” అట్టాంటి ఇట్టాంటి దాన్ని కాదు మావో” అంటూ సాగే ఈ మాస్ బీట్…

తనపై కామెంట్స్ కు కిరణ్ సాలిడ్ రిప్లై..!
కిరణ్ అబ్బవరం.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. ముఖ్యంగా యూత్ కు. చేసింది తక్కువ సినిమాలే కానీ ఈ యంగ్ హీరో మాత్రం ఇప్పుడు టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అవుతున్నాడు. దానికి కారణం కిరణ్ కు వరుసగా వస్తున్న అవకాశాలే. ఫుల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలకు వరుసగా అవకాశాలు రావడం కామన్ థింగే. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకండా తెలుగు తెరకు పరిచయమైన కిరణ్ కు వరుసగా అవకాశాలు రావడమే కాదు.. అది కూడా పెద్ద బ్యానర్లలో సినిమాలు రావడం అంటే మాములు విషయం కాదు. రాజావారు రాణి వారు సినిమాతో కిరణ్ అబ్బవరం ఎంట్రీ ఇచ్చారు. అయితే అది పెద్ద సినిమా కాదు.. అలానే బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టలేదు. కానీ…

బర్త్ డే విషెస్ చెప్పిన అందరికీ థ్యాంక్స్ -కిరణ్ అబ్బవరం
షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలి సినిమా "రాజావారు రాణిగారు" తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు."ఎస్ఆర్ కల్యాణ మండపం" చిత్రంతో కమర్షియల్ సక్సెస్ సాధించారు. కిరణ్ హీరోగా తెరకెక్కిన "సెబాస్టియన్ PC524", "సమ్మతమే " మూవీస్ పరాజయం పొందాయి. రెండు బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ వచ్చినా కూడా కిరణ్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.గీతా ఆర్ట్స్ - మైత్రీ మూవీ మేకర్స్ - మెగా సూర్య మూవీస్ వంటి టాలీవుడ్ లోని పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కిరణ్ అబ్బవరంతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాయి.

'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' టీజర్ రిలీజ్
రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో ఉన్న ఇతర యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కేవలం చిన్న బ్యానర్లు కాదు మైత్రీ, గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద పెద్ద బ్యానర్లలో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా కూడా ఒకటి. శ్రీధర్ గాదే దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను నేడు రిలీజ్ చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. చెప్పినట్టే…

నేను మీకు బాగా కావాల్సినవాడిని' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్ కల్యాణమండపం, సెబాస్టియన్ పీసీ 524, ఇటీవల సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఎప్పుడో మొదలై ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్ డేట్ తో వచ్చేసింది. ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్. జులై 10వ తేదీన 11.05 నిమిషాలకు ఈ…

'సమ్మతమే' రిలీజ్ డేట్, ట్రైలర్ అప్ డేట్..!
ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. ఆ తరువాత ఎస్ఆర్ కల్యాణమండపంతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇటీవల సెబాస్టియన్ 524 పీసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ అది బోల్తాకొట్టింది. ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు ఉన్నాయి. వీటిలో సమ్మతమే సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది.

కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్..!
కరోనా థర్డ్ వేవ్ వల్ల కూడా చాలా సినిమాల రిలీజ్ డేట్లు మారిపోయాయి. ముందే రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు మారిపోవడంతో చిన్న సినిమాల రిలీజ్ డేట్లు కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఇక ప్రస్తుతం అయితే పెద్ద సినిమాలు పెద్దగా లేవు. పెండింగ్ లో ఉన్న సినిమాలు మొత్తం రిలీజ్ అయిపోయాయి. దీంతో చిన్న సినిమాలు మళ్లీ కొత్తగా రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ డేట్లు మారగా.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం సమ్మతమే చిత్రయూనిట్ కూడా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది.

'సెబాస్టియన్ P.C 524' ట్రైలర్ రిలీజ్
బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా సెబాస్టియన్ పీసీ 524. ఈ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా కిరణ్ ఒక డిఫరెంట్ పాత్రలో వస్తున్నట్టు అర్థమవుతుంది. కానిస్టేబుల్ పాత్రలో నైట్ బ్లైండ్ నెస్ తో ఎలా విధులు నిర్వహించాడు అన్న నేపథ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సెబాస్టియన్ P.C 524'
రాజా వారు రాణి వారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అలాగే రెండో సినిమా SR కళ్యాణ మండపం తో మరో హిట్ ను అందుకున్నాడు కిరణ్. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం అయితే బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో 'సెబాస్టియన్ P.C 524' సినిమా వస్తుంది. ఈసినిమాలో కూడా కిరణ్ మరో డిఫరెంట్ రోల్ తో వస్తున్నాడు. కిరణ్ నైట్ బ్లైండ్‌నెస్ ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాఈ సినిమాలో. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్…

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్..!
ఈమధ్య సినిమా టైటిల్స్ తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక అందులో మొదటి నుండి డిఫరెంట్ టైటిల్స్ ను పెట్డడంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎప్పుడూ ముందుంటాడు. మొదటి సినిమాకే 'రాజావారు.. రాణివారు' అనే టైటిల్ పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ సినిమా తో హిట్ కొట్టాడు. ప్రస్తుతం ‘సమ్మతమే’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. రీసెంట్ గానే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న సినిమాకు వినరో భాగ్యము విష్ణు కథ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.