టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తున్నాడు. ఈ టాలెంటెడ్ నటుడు ఇటీవలే ‘క’ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో కెరీర్‌లో తొలిసారి 50 కోట్ల మార్క్ అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రుబా’. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో నటి నజియా డేవిసన్ కీలక పాత్రలో కనిపించనుంది. విశ్వ కరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దిల్ రుబా రిలీజ్ కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది.
అయితే ‘క’ సినిమా కన్నా ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. కాగా ఇది కిరణ్ అబ్బవరం నటిస్తోన్న 10వ చిత్రం కావడం విశేషం. ‘క’ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు కిరణ్ ప్రయత్నిస్తున్నాడు. సామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను Yoodlee ఫిల్మ్స్ మరియు శివం సెల్యులాయిడ్స్ బ్యానర్స్‌పై రవి, జోజో జొస్ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: