టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు కిరణ్. ఇక వెంటనే మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా వస్తున్న సినిమా మీటర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్న ఈసినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను ఏప్రిల్ 7వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
The maximum measure of entertainment – #Meter 💥
Entertaining in cinemas from April 7th, 2023❤️🔥@Kiran_Abbavaram #RameshKaduri @AthulyaOfficial #SaiKartheek #VenkatCDileep #SarangamSuresh @ClapEntrtmnt @SonyMusicSouth pic.twitter.com/OL81l6gP9K
— Mythri Movie Makers (@MythriOfficial) March 1, 2023
కాగా ఈసినిమాలో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అతుల్య రవి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. 2017లోనే కోలీవుడ్ కి పరిచయమైన అతుల్య ఈ సినిమాతో ఇక్కడ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: