
ట్యాగ్ · 17 కథనాలు


డీజే టిల్లు తో వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే

టాలీవుడ్ లో డిసెంబర్ 9 వ తేదీ సినిమాల జాతర

“హ్యాపీ బర్త్ డే” మూవీ న్యూ రిలీజ్ డేట్

నాగశౌర్య 'లక్ష్య' ట్రైలర్ రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తెల్లవారితే గురువారం'

'తెల్లవారితే గురువారం' ట్రైలర్ రిలీజ్
'ఆకాశవాణి' టీజర్ రిలీజ్
'తెల్లవారితే గురువారం' టీజర్ రిలీజ్
ఎమ్ ఎమ్ కీరవాణి ప్లాస్మా డొనేషన్

69వ జాతీయ సినిమా అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఈ చలనచిత్ర పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడగా.. 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా చాటింది. మునుపెన్నడూ లేనిస్థాయిలో పలు విభాగాల్లో అనేక అవార్డులను కొల్లగొట్టింది. వివిధ విభాగాల్లో 10 జాతీయ అవార్డులు దక్కించుకుని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది తెలుగు సినిమా.

ఓటీటీలోకి వచ్చేసిన భాగ్ సాలే
ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీసింహా హీరోగా వచ్చిన సినిమా భాగ్ సాలే. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ భాగ్ సాలే జూలై 7, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైమండ్ రింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఎంతోకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నశ్రీసింహాకు ఈసినిమా కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమాను నేడు రిలీజ్ చేశారు. మరి థియేటర్లలో చూడటం మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

డీజే టిల్లు తో వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే
ప్రణీత్ బ్రమాండపల్లి దర్శకత్వంలో శ్రీసింహా కోడూరి హీరోగా వస్తున్న సినిమా భాగ్ సాలే. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు. ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. అయితే ఈసినిమా షూటింగ్ ను చాలా సైలెంట్ గా పూర్తి చేశారు మేకర్స్. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. రీసెంట్ గానే రిలీజ్ డేడ్ ను కూడా ప్రకటించారు. జులై 7వ తేదీన ఈసినిమాను ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే పేరుతో ఓ…

ఆస్కార్ అవార్డు తో హైదరాబాద్ కు చేరుకున్న ఆర్ ఆర్ ఆర్ టీమ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు…

టాలీవుడ్ లో డిసెంబర్ 9 వ తేదీ సినిమాల జాతర
సంక్రాంతి పండగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానుండటం తో చిన్న సినిమాలు దాదాపు 15 పైగా డిసెంబర్ 9 వ తేదీ రిలీజ్ కానున్నాయి. టాలీవుడ్ లోఒకే రోజు 5 లేదా 6 సినిమాలు రిలీజ్ కావడం సాధారణమే . ఒకే రోజు 15 సినిమాలకు పైగా రిలీజ్ కావడం విశేషం. ఈ సినిమాల్లో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం , ఆర్ జివి డేంజరస్ , ముఖ చిత్రం వంటి సినిమాలలో తెలిసిన యాక్టర్స్ వున్నారు. మిగతా సినిమాలన్నింటిలో కొత్తవారే నటిచడం విశేషం.

హ్యాపీ బర్త్ డే మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలను లాజిక్కులు లేకుండా చూస్తూనే బెటర్. కామెడీ థ్రిల్లర్ కాబట్టి ప్రతిఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

“హ్యాపీ బర్త్ డే” మూవీ న్యూ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సూపర్ హిట్ “మత్తు వదలరా” మూవీ ఫేమ్ డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నరేష్ అగస్త్య , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇటీవలే ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ గా నిలిచింది…

"హ్యాపీ బర్త్ డే" మూవీ లో రిత్విక్ సోది పాత్రలో వెన్నెల కిషోర్
మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సూపర్ హిట్ "మత్తు వదలరా" మూవీ ఫేమ్ డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో "హ్యాపీ బర్త్ డే" మూవీ జులై 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నరేష్ అగస్త్య , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇటీవలే ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ గా నిలిచింది.

ఆర్ఆర్ఆర్.. 'కొమరం భీమ్' సాంగ్ ప్రోమో రిలీజ్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా నుండి పోస్టర్లు, టీజర్లు, పాటలు, ట్రైలర్ రిలీజ్ చేసి మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా మరో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. కొమరం భీముడో అంటూ సాగే నాలుగో పాట రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. మొత్తం ఐదు భాషల్లో ప్రోమోను వదిలారు. ‘కొమరం భీముడో.. కొమరం భీముడో .. కొర్రాసులెవడోలే మండాలి కొడకా’ అంటూ సాగే ఈ పాట ఎమోషనల్ గా అనిపిస్తుంది…

నాగశౌర్య 'లక్ష్య' రివ్యూ
ఫైనల్ గా చెప్పాలంటే అందరూ ఒకసారి చూసే సినిమా అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు ఇష్టపడే వారికి మరింత నచ్చుతుంది.

నాగశౌర్య 'లక్ష్య' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ కొట్టిన నాగశౌర్య ఇప్పుడు లక్ష్య అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఈసినిమాలో నాగశౌర్య మేకోవర్ కూడా సినిమాపై మంచి క్రేజ్ ను పెంచేసింది. ఇక ఈసినిమా డిసెంబర్ 10న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ లో జిబీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ ను…

మైత్రీ మూవీ మేకర్స్- క్లాప్ ఎంటర్ టైన్ మెంట్ పై మరో సినిమా
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరూ నిర్మాతలుగా మారిపోతున్నారు. డైరెక్టర్స్ దగ్గర నుండి హీరోలు అలానే ఇప్పుడు హీరోయిన్స్ కూడా ప్రొడక్షన్ లోకి దిగిపోతున్నారు. అంతేకాదు గతంలో ఉన్నట్టు కాకుండా ఒక్క నిర్మాణ సంస్థ నుండే కాకుండా జాయింట్ గా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇక మొదటి నుండి భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో సూపర్ హిట్స్ తో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకూడా వేరే బ్యానర్స్ తో కలిసి సినిమాలు చేయడానికి రెడీ అవుతుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తెల్లవారితే గురువారం'
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ట్రైలర్ నురిలీజ్ చేయగా దానికి కూడా మంచి స్పందన రాబట్టుకుంది.

'తెల్లవారితే గురువారం' ట్రైలర్ రిలీజ్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఈసినిమా మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక అక్కడే అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్.
'ఆకాశవాణి' టీజర్ రిలీజ్
రాజమౌళి దగ్గర అనేక సినిమాలకు పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆకాశవాణి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కానీ ఇంతవరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఇప్పుడు తాజాాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
'తెల్లవారితే గురువారం' టీజర్ రిలీజ్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
ఎమ్ ఎమ్ కీరవాణి ప్లాస్మా డొనేషన్
"మనసు మమత "(1990 ) మూవీ తో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఎమ్ ఎమ్ కీరవాణి మూడు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక నేషనల్ , 8 ఫిల్మ్ ఫేర్ , 11 నంది అవార్డ్స్ ను కీరవాణి అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగర్ , లిరిసిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీరవాణి ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం "మూవీ కి సంగీతం అందిస్తున్నారు.