మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా వస్తున్న సినిమా ‘తెల్లవారితే గురువారం’. మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ట్రైలర్ నురిలీజ్ చేయగా దానికి కూడా మంచి స్పందన రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది చిత్రబృందం.
#ThellavaritheGuruvaram is Certified with ‘U/A’⚡
Get ready to join the wedding shenanigans in 4️⃣ days🥳In cinemas from March 27th!
Trailer▶️https://t.co/QlagapiLL6
Tickets▶️https://t.co/RhwcjuIbCw@Simhakoduri23 @gellimanikanth @kaalabhairava7 @SaiKorrapati_ @Benny_Muppaneni pic.twitter.com/iqM2PxZ6E6— Telugu FilmNagar (@telugufilmnagar) March 23, 2021
ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, సత్య, అజయ్, వైవా హర్ష, శరణ్యా ప్రదీప్, గిరిధర్, ప్రియ, రవివర్మ, పార్వతి, సిరి హనుమంత్, మౌర్య, పద్మావతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కలర్ ఫొటో’ లాంటి మంచి సినిమాను అందించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇప్పుడు వారాహి చలన చిత్రంతో కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘మత్తు వదలరా’ సినిమాతోనే సంగీత దర్శకుడిగా పరిచయమైన కాలభైరవానే ఈ సినిమాకు కూడా సంగీతం అందించనున్నాడు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. మార్చి 27న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
మరి మొదటి సినిమాతో మంచి హిట్ కొట్టిన శ్రీసింహా కు.. రెండవ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: