ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మూడో వారంలో కూడా సాలిడ్ వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ ను కొనసాగిస్తోంది. వరసగా 19రోజులు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు మించి షేర్ ను రాబట్టింది.దాంతో బాహుబలి 2(28)బాహుబలి(20) ,హనుమాన్(20) తర్వాత వరుసగా అత్యధిక రోజులు కోటి రూపాయల కు మించి షేర్ ను రాబట్టిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.అయితే నిన్న భారీ వర్షాల కారణంగా కోటి మిస్ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కల్కి తరువాత దేవర సాలిడ్ లాంగ్ రన్ కొనసాగిస్తోంది.పోటీ లేకపోవడం అలాగే దసరా సెలువులు కలిసి రావడంతో సినిమాకు ఎదురులేకుండా పోయింది.ఇప్పటికే 500కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం తో బయ్యర్లకు భారీ లాభాలు చూస్తున్నారు.అటు హిందీ వెర్షన్ కూడా అదరగొడుతుంది.ఇప్పటివరకు నార్త్ లో 70కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే వచ్చే నెల రెండో వారంలో ఈసినిమా స్ట్రీమింగ్ లోకి వచ్చే ఛాన్స్ వుంది.అన్నిభాషలకు గాను నెట్ ఫ్లిక్స్ ఈ హక్కులను దక్కించుకుంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు.అనిరుధ్ సంగీతం అందించాడు.యువసుధ ఆర్ట్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించాయి.ఇక దేవర సెకండ్ పార్ట్ 2026లో సెట్స్ మీదకు వెళ్లేలా వుంది.ప్రస్తుతం ఎన్టీఆర్,వార్ 2 తో బిజీ గా వున్నాడు. త్వరలోనే ప్రశాంత్ నీల్ సినిమాను కూడా స్టార్ట్ చేయనున్నాడు.దాంతో దేవర 2 స్టార్ట్ అయ్యేందుకు చాలా సమయం పట్టేలా వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























