మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. అయితే తొలి రెండు, మూడు రోజులు కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ, అలాగే ఓవర్ సీస్ లోనూ అదరగొట్టేసింది.
ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో కొత్త రికార్డులను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 510 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తద్వారా ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో ఫస్ట్ 500 కోట్ల మూవీగా నిలిచింది. ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఈ రికార్డ్ అందుకున్నా.. సోలో హీరోగా మాత్రం ఇదే ప్రథమం.
దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించేందుకు తారక్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఎదురుచూపులు తెరదించుతూ డిజిటల్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. త్వరలోనే ప్రముఖ ఓటీటీలో ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, నవంబర్ 8న దేవర స్ట్రీమింగ్ కానుంది.
కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: