దేవరకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం

NTR Pens an Emotional Letter to Fans and Devara Team

దేవర సినిమాకు ఎప్పటికీ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో దేవర బ్లాక్ బస్టర్ కావడంపై ఎన్టీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడానికి ఆయనకు సరైన వేదిక దొరకలేదు. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా, అది అర్ధాంతరంగా రద్దు అయింది. అలాగే మూవీ రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ నిర్వహించడానికి మేకర్స్ సన్నద్ధమవగా అనుమతి లేకపోవడంతో అది కూడా ఆగిపోయింది.

దీంతో ఎన్టీఆర్ అభిమానులు బాగా నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో దేవర 500 కోట్ల క్లబ్ లోకి చేరడంతో ఎన్టీఆర్ తన ఆనందాన్ని లేఖ రూపంలో అభిమానులతో పంచుకున్నారు. దీనిలో భాగంగా ఆయన తాజాగా ఎక్స్ వేదికగా ఒక లేఖను విడుదల చేశారు. ఇందులో దేవర చిత్రానికి పనిచేసిన నటీనటులు మరియు టెక్నిషియన్స్ సహా చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించడంతో పాటు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ లేఖలో ఎన్టీఆర్ ఇలా తెలిపారు.. “దేవర పార్ట్ 1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. నా సహ నటులైన సైఫ్ అలీ ఖాన్ సర్, జాన్వీ, ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు మరియు ఇతర నటీనటులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు తమ పాత్రలకు ప్రాణం పోసి, మా కథకు జీవం ఇచ్చారు.”

“నా దర్శకుడు కొరటాల శివగారికి ధన్యవాదాలు. ఈ కథను సృష్టించిన ఆయన దిశానిర్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది. అనిరుధ్ అద్భుతమైన సంగీతం, రత్నవేలు సర్ సినిమాటోగ్రఫీ, సాబు సార్ ప్రొడక్షన్ డిజైన్, యుగంధర్ గారు వీఎఫ్‌ఎక్స్, శ్రీకర్ ప్రసాద్‌గారు ఎడిటింగ్‌తో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు.”

“మా సినిమాను విజయవంతంగా ప్రదర్శించిన పంపిణీదారులు మరియు థియేటర్ ప్రదర్శకులకు ధన్యవాదాలు. నా సినీ పరిశ్రమ మిత్రులకు, వారు అందించిన ప్రేమకు ధన్యవాదాలు. అలాగే, దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు మా సినిమాను విశేషంగా ప్రోత్సహించినందుకు కృతజ్ఞతలు.” అని లేఖలో పేర్కొన్నారు యంగ్ టైగర్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.