లెజెండరీ యాక్టర్, నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా.. ఆయన మనవలు, స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. ఈ మేరకు ఈ ఉదయం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్దకు చేరుకున్న నట సోదర ద్వయం తాతకు పుష్పాంజలి ఘటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌కు అంజలి ఘటించారు. ఇక యుగపురుషుడు, మహా నేత, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని తమ ప్రియతమను స్మరించుకుంటూ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
నటుడు, స్టూడియో అధినేత, నిర్మాత, దర్శకుడిగా కళామతల్లికి సేవలు అందించిన ఎన్టీఆర్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు మేలుకలిగేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. కేంద్రంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా, నేషనల్ ఫ్రంట్ సర్కార్ ఏర్పాటులో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: