ఆర్ఆర్ఆర్.. జపాన్‌లో సెన్సేషనల్ రన్

RRR Creates Sensational Record Run in 71 Year Old Theatre at Japan

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం) చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. వసూళ్లపరంగానే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం సాధించింది. ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం సహా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ వంటి అవార్డులను గెలుచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇండియన్ సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లిన చిత్రం ఇదంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు, నటీనటులు, టెక్నిషియన్స్ ఆర్ఆర్ఆర్ చూసి అచ్చెరువొందారు. టైటానిక్, అవతార్ వంటి విజువల్ వండర్స్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్ వంటి స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వానికి ఫిదా అయిపోయాడంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఈ సినిమా ఏ రేంజ్‌లో మ్యాజిక్ చేసిందో.

మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లకు మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్‌ అనే ట్యాగ్ లైన్స్ వచ్చాయంటే అందుకు కారణం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో వారు స్వాతంత్య్ర సమర యోధులుగా తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇటీవలికాలంలో వచ్చిన సరైన మల్టీస్టారర్ అంటే ఈ సినిమానే.

అయితే ఈ సినిమా మన దేశంలో ఎంతగా ప్రభంజనం సృష్టించిందో జపాన్ దేశంలోనూ అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా చెప్పాలంటే మన దగ్గర కంటే అక్కడే ఈ చిత్రం హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. జపనీయులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు ఎగబడ్డారు. డబ్బింగ్ చిత్రమైనా వారు దీనిని తమ సొంత సినిమాగా భావించి ఆదరించారు. దీంతో ఆర్ఆర్ఆర్ జపాన్‌లో కూడా బ్లాక్ బస్టర్ అయింది.

ఈ క్రమంలో ఈ చిత్రం ఓ అరుదైన రికార్డ్ అందుకుంది. అక్కడ గల ఒక హిస్టారికల్ థియేటర్‌లో ఈ సినిమా సంవత్సరాల తరబడి ప్రదర్శించబడుతోంది. ఏకంగా ఒక సంవత్సరం 9 నెలలుగా ఆర్ఆర్ఆర్ నిర్విరామంగా రన్ అవుతుండటం విశేషం. ఈ మేరకు మేకర్స్ తాజాగా దీనిని గురించి సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా జపాన్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఈ వారంతో ఈ చిత్రం రన్‌ను ముగిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.