10వ రోజు దేవర సెన్సేషన్

devara 10 days collections

బాక్సాఫీస్ వద్ద దేవర హవా కొనసాగుతుంది.వేరే సినిమాలనుండి పోటీ లేకపోవడం దసరా సెలవులు స్టార్ట్ కావడంతో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.నిన్న అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్సెలెంట్ గ్రోత్ చూపించింది.చాలా చోట్ల నైట్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి.దాంతో దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.10రోజుల్లో ఈసినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి 140కోట్ల షేర్ ను రాబట్టి భారీ లాభాలను తీసుకొస్తుంది.ఈవారం కూడా సాలిడ్ రన్ కన్ ఫర్మ్ మే.ఇక తెలుగు తరువాత హిందీ లో ఈసినిమా అదరగొడుతుంది.నిన్న నార్త్ లో 4.20కోట్ల నెట్ ను రాబట్టుకుంది.దాంతో10రోజుల్లో అక్కడ  58.47కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరుతుందా అనేది ఆసక్తిగా మారింది.ఓవరాల్ గా చూస్తే హిందీలో ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రపంచ వ్యాప్తంగా 10రోజుల్లో దేవర 466కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.ఫుల్ రన్ లో 500కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.అదే జరిగితే ఎన్టీఆర్ కు సోలో గా ఇదే 500కోట్ల సినిమా కానుంది.కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటించాడు.శ్రీకాంత్,ప్రకాష్ రాజ్,అజయ్ కీలక పాత్రల్లో కనిపించారు.అనిరుధ్ సంగీతం అందించాడు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్,వార్ 2లో నటించండానికి రెడీ అవుతున్నాడు.అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తుండగా హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నాడు.ఈసినిమాతో పాటు ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ తో 31వ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.ఈఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.2026లో జనవరి 9న రిలీజ్ కానుంది.ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తరువాతే దేవర 2స్టార్ట్ అయ్యే ఛాన్స్ వుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.