మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో రికార్డులను సృష్టించింది. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. అయితే తొలి రెండు, మూడు రోజులు కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ, అలాగే ఓవర్ సీస్ లోనూ అదరగొట్టేసింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో కొత్త రికార్డులను సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 510 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తద్వారా ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో ఫస్ట్ 500 కోట్ల మూవీగా నిలిచింది. ఇంతకుముందు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఈ రికార్డ్ అందుకున్నా.. సోలో హీరోగా మాత్రం ఇదే ప్రథమం. ఇక ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా దేవర చిత్రం మరోసారి వార్తల్లోకొచ్చింది. టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన దేవర పార్ట్ 1 త్వరలో జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ మూవీ జపనీస్ భాషలో జపాన్ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది. కాగా జపాన్‌లో జూనియర్ కి విశేష ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు అక్కడ లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. దీంతో దేవర జపాన్‌లో హ్యూజ్ హిట్ అవడం పక్కా అని మేకర్స్ అంచనా వేస్తున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























