మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. నిజమైన ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. యాక్టింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా ఏదయినా ఆయనకు కొట్టిన పిండి. ఇవన్నీ ఆయనను ప్రజెంట్ జెనరేషన్ హీరోలలో భిన్నంగా చూపుతాయి. ముఖ్యంగా ఆయన ప్రత్యేకత ఏంటంటే..? డైలాగ్ మాడ్యులేషన్. తెలుగు భాషపై పట్టు కలిగిన తారక్ పలికే ప్రతి పదంలో స్పష్టత ఉంటుంది, ఒక ఫీల్ కలుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏ పదం ఎలా ఉచ్చరించాలో.. ఎక్కడ నొక్కి చెప్పాలో.. ఎంతవరకూ చెప్పాలో.. చెప్పేటప్పుడు ఎలాంటి భావాలను ప్రతిధ్వనించాలో.. ఇలా ప్రతిదీ కొలతలేసినట్టు ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఆయనతో ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ చెప్పించడానికి ఆసక్తి చూపిస్తుంటారు మేకర్స్. గంభీరమైన ఆయన వాయిస్ తమ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేస్తుందని వారు బలంగా నమ్ముతారు.
దీనికి ఒక ఉదాహరణే.. తాజాగా విడుదలైన ‘కింగ్‌డమ్’. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఈ చిత్రం తెలుగు టీజర్ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో తారక్ తన గాత్రంతో కథానాయకుడి పాత్రను పరిచయం చేసిన తీరుకి అందరూ ఫిదా అవుతున్నారు. కాగా ఈ టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా జూనియర్ గతంలో వాయిస్ ఓవర్ అందించిన సినిమాలను గుర్తుచేసుకుంటున్నారు.
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో రామ్ పోతినేని కెరీర్ తొలినాళ్లలో నటించిన ‘రామరామ కృష్ణకృష్ణ’ సినిమా కోసం తొలిసారి గొంతు సవరించుకున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి తాను నటించిన మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో చరణ్ పాత్రను పరిచయం చేసేందుకు తారక్ మరోసారి గాత్రం అరువిచ్చాడు.
దీని తర్వాత మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’ మూవీ టీజర్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసాడు. కథతోపాటు హీరో పాత్రధారిని ఆడియెన్స్ కు పరిచయం చేసి సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసాడు. ఇలా ఇతర హీరోల సినిమాల్లో తన పవర్‌ఫుల్ వాయిస్‌తో కథానాయకుడి పాత్రలను ఎలివేట్ చేశాడు ఎన్టీఆర్. అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇలా ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి.
దీంతో ఆయన తాజాగా గాత్రం అందించిన విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ సినిమా కూడా సూపర్ హిట్ పక్కా అని ఎన్టీఆర్ అభిమానులే కాదు, మూవీ లవర్స్ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఈ సెంటిమెంట్ నిజమై ఈ ఫిల్మ్ సక్సెస్ అయితే, సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ దక్కినట్టే. ఇది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాలి మరి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























