మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో 396 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, దేవర మొదటివారం గడిచేసరికి 400 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 405 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా ఎన్టీఆర్ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ 400 కోట్ల క్లబ్ లోకి ఎంటరవడం విశేషం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈ రికార్డ్ అందుకున్నా.. సోలో హీరోగా మాత్రం ఇదే ప్రథమం.
అయితే తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం స్కూళ్లకు, కాలేజీలకు దసరా సెలవులు ఉన్నందున ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలావుంటే, తాజాగా చిత్ర బృందం ‘దావూది’ పాటను థియేట్రికల్ వెర్షన్‌లో నేటినుంచి జత చేశారు. ఈ పాట ఆడియెన్స్‌కు స్పెషల్ స్పెషల్ సర్‌ప్రైజ్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో రిపీట్ ఆడియెన్స్ పెరుగుతారని అంచనా వేస్తున్నారు.
కాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























