
ట్యాగ్ · 37 కథనాలు · పేజీ 2


"#NTR30" మూవీ లో ఎన్టీఆర్ రఫ్ లుక్ ?

ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ రిలీజ్

డబల్ హ్యాట్రిక్ తో ఎన్టీఆర్ రికార్డ్

ముత్తాత(ఎన్టీఆర్)పోలికలతో భార్గవ్ రామ్

మరో మల్టీ స్టారర్ ఛాన్స్ వస్తే వారితో చేస్తా..!

తిరుమల శ్రీవారి సన్నిధి లో ఎన్టీఆర్ ఫ్యామిలీ

చిన్న విలేజ్ లో "సింహాద్రి " మూవీ రికార్డ్

ఆ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఉంది..!

ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్

'ఎన్టీఆర్' 21 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో పాత్రలు

మళ్ళీ "జనతా గ్యారేజ్ "లుక్ లో ఎన్టీఆర్

ఎన్టీఆర్ పై సుధీర్ బాబు ప్రశంసలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రికార్డ్

బర్త్ డే కి #NTR31 అప్ డేట్..?

ఎన్టీఆర్ కూడా ఆ లిస్ట్ లో..!

'ఎన్టీఆర్' ఎమోషనల్.. ఈ గుండె మరోసారి తాకిపో తాత..!
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్.టి.రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినీ రంగంలో ఆయన సృష్టించిన సంచలనాలు, నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కాదు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు... యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. కేవలం సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఆయన చెరగని ముద్ర వేశారు. తెలుగు ప్రజలకు సేవ చేయాలని రాజకీయరంగంలోకి అడుగుపెట్టిన ఆయన చాలా తక్కువ నెలలోనే ముఖ్యమంత్రిగా పలు సేవలు అందించారు.

"#NTR30" మూవీ లో ఎన్టీఆర్ రఫ్ లుక్ ?
బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 2వ వారం నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం.

ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీ రిలీజ్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తం గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ "మూవీ లో కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “#NTR30” మూవీకై ఎన్టీఆర్ ప్రిపేర్…

డబల్ హ్యాట్రిక్ తో ఎన్టీఆర్ రికార్డ్
“నిన్ను చూడాలని “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ “స్టూడెంట్ నెం 1” తో కమర్షియల్ హీరోగా మారారు. "ఆది ", "సింహాద్రి ", "సాంబ ", ", యమదొంగ " , బృందావనం" వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా మారారు. తరువాత ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి.

ముత్తాత(ఎన్టీఆర్)పోలికలతో భార్గవ్ రామ్
లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు మనవడు , ఫిల్మ్ యాక్టర్ , పొలిటీషియన్ హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. నార్నే ఎస్టేట్స్ అధినేత నార్నే శ్రీనివాస్ తనయ లక్ష్మి ప్రణతిని 2011 సంవత్సరంలో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. వీరికి అభయ్ రామ్ , భార్గవ్ రామ్ తనయులు.

మరో మల్టీ స్టారర్ ఛాన్స్ వస్తే వారితో చేస్తా..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఇద్దరు స్టార్ హీరోలు కాకుండా అందలోనూ ఎన్టీఆర్-రామ్ చరణ్ కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమా కోసం కేవలం ఎన్టీఆర్-చరణ్ అభిమానులు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు ఫైనల్ గా మార్చి 25 న బ్రేక్ పడనుంది. ఇక దీంతో చిత్రయూనిట్ మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

తిరుమల శ్రీవారి సన్నిధి లో ఎన్టీఆర్ ఫ్యామిలీ
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన "ఆర్ ఆర్ ఆర్ " మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న "#NTR 30" మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో కూడా ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో ఎన్టీఆర్ మినహా మిగిలిన కుటుంబ సభ్యులంతా తిరుమలకు వెళ్లారు.

చిన్న విలేజ్ లో "సింహాద్రి " మూవీ రికార్డ్
విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సింహాద్రి “మూవీ 2003 జులై 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భూమిక , అంకిత కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్ డ్యాన్స్ , యాక్షన్ సీన్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “సింహాద్రి “మూవీ ని తెరకెక్కించారు. “సింహాద్రి “మూవీ 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ఉంది..!
యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈసినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అస్సలు గ్యాప్ లేకుండా సౌత్ లో నార్త్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. సూపర్ హిట్ "అరవింద సమేత వీరరాఘవ " మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ 3 సంవత్సరాల తరువాత “రౌద్రం రణం రుధిరం ” మూవీతో అలరించనున్నారు.

'ఎన్టీఆర్' 21 ఏళ్ల సినీ ప్రయాణం.. ఎన్నో పాత్రలు
సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అయితే వారసులు గా ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుంది కానీ వాళ్లకే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ తో ఉంటారు.. ఆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయితే ఓకే కానీ అవ్వకపోతే మాత్రం ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో కొనసాగడం అనేది కష్టమే. అలాంటిది నట సార్వభౌముడు ఎన్టీఆర్ పోలీకలు పుణికి పుచ్చుకొని.. జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇవ్వాలంటే ఇంకా ఏ రేంజ్ లో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం ఒమ్ము చేయలేదు. తాతకు తగ్గ మనవడు అనిపించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా…

మళ్ళీ "జనతా గ్యారేజ్ "లుక్ లో ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , తారాగణం తో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమురం భీం గా నటిస్తున్న ఎన్టీఆర్ ఆ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. యువ సుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "#NTR30"మూవీ కి హీరో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

ఎన్టీఆర్ పై సుధీర్ బాబు ప్రశంసలు
సక్సెస్ ఫుల్ "పలాస 1978 " మూవీ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు , ఆనంది జంటగా రూపొందిన "శ్రీదేవి సోడా సెంటర్ " మూవీ సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. "శ్రీదేవి సోడా సెంటర్ " మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు విడుదలకు ముందు నుండి విడుదల అయిన తర్వాత కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు . తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రికార్డ్
"నిన్ను చూడాలని "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన జూనియర్ ఎన్టీఆర్ "స్టూడెంట్ నెం 1 "మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "టెంపర్ "మూవీ తో ఎన్టీఆర్ వరస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎన్టీఆర్ కు అభిమాన గణం అధికమే. అభిమానులు ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.

బర్త్ డే కి #NTR31 అప్ డేట్..?
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ రిలీజ్ పై కన్ఫ్యూజన్ మాత్రం అలానే ఉంది. ఇప్పటికే రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. కావాలని చేసినా.. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లన కారణాలు ఏదైనా దాని ఎఫెక్ట్ మాత్రం సినిమా రిలీజ్ పై పడుతుంది. ఎప్పుడో మూడేళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైంది.. జక్కన్న ను నమ్ముకుని సినిమా చేసేందుకు బప్పుకున్న ఎన్టీఆర్.. రామ్ చరణ్ ఈసినిమాకే లాక్ అయిపోయారు... మరోవైపు ఫ్యాన్స్ తొందరపెడుతున్నారు.. దానికితోడు కరోనా వచ్చి పెద్ద సమస్యగా మారింది.. అసలే లేట్ అయిపోతుంది అనుకుంటే..దీనివల్ల మరింత లేట్ అయింది.. ఇక ఈఏడాది అక్టోబర్ 13న రిలీజ్ చేద్దామని…

అభిమానులకు ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం "మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "NTR30 "మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1" మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక మూవీ రూపొందనుంది.

ఎన్టీఆర్ కూడా ఆ లిస్ట్ లో..!
కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కరోనాపై పోరాటానికి, ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజల సహాయార్థం నిధులు అవసరం ఎంతో ఉంది. అందుకే, టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు తమ వంతు సాయంగా ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటించారు.