“నిన్ను చూడాలని “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ “స్టూడెంట్ నెం 1” తో కమర్షియల్ హీరోగా మారారు. “ఆది “, “సింహాద్రి “, “సాంబ “, “, యమదొంగ ” , బృందావనం” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఎన్టీఆర్ తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా మారారు. తరువాత ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కిన కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనని తాను మార్చుకొని తన కథల్లోనూ, నటనలోనూ, బాడీ లోను మరింత వైవిధ్యాన్ని తీసుకొచ్చి కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తూ హిట్స్ సాధిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “టెంపర్ “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ విజయ పథం లో దూసుకుపోతున్నారు.”టెంపర్”, “నాన్నకు ప్రేమతో”, “జనతా గ్యారేజ్” సినిమాలతో ఎన్టీఆర్ హ్యాట్రిక్ హిట్ సాధించారు.ఆ తరువాత ఎన్టీఆర్ “జై లవ కుశ”, “అరవిందసమేత వీరరాఘవ”, “ఆర్ఆర్ఆర్” సినిమాలతో మరోసారి హ్యాట్రిక్ హిట్ సాధించారు.వరుసగా ఆరు సినిమాలు హిట్ మీద హిట్ కొట్టి ఎన్టీఆర్ డబల్ హ్యాట్రిక్ హిట్స్ తో సరికొత్త రికార్డుని సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: