బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్ ” మూవీ ఘనవిజయం సాధించింది. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై 2వ వారం నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NTR30” మూవీ మోషన్ పోస్టర్ కు అద్భుత స్పందన లభించింది. ఈ మూవీ స్క్రిప్ట్ లో పొలిటికల్ టచ్ తో పాటుకొరటాల మార్క్ సందేశం కూడా ఉంటుందనీ , ఎన్టీఆర్ న్యూ లుక్ కు ప్రిపేర్ అవుతుంటే , స్క్రిప్ట్ కి కొరటాల తుది మెరుగులు దిద్దుతున్నారనీ సమాచారం. “జనతా గ్యారేజ్” సినిమాలో ఎన్టీఆర్ ను డిఫరెంట్ లుక్ తో చూపించిన కొరటాల, ఈ సినిమాలో ఎన్టీఆర్ ను రఫ్ లుక్ తో చూపించనున్నారనీ , 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ మూవీ ని రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: