
ట్యాగ్ · 39 కథనాలు · పేజీ 2


ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ - ఫ్యాన్స్ ఫిదా

ఎన్టీఆర్ కు వార్నర్ బర్త్ డే విషెస్..!
అభిమానులకు సర్ ప్రైజ్
అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం..!
జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రికార్డ్
భారీ చిత్రాల హీరో ఎన్టీఆర్
అభిమానులకు శుభవార్త
తన స్టాఫ్ కు అండగా నిలిచిన ఎన్టీఆర్..!
"ఎన్టీఆర్ 30" లో మరో యంగ్ హీరో ?
మలయాళ భాష ప్రాక్టీస్ లో ఎన్టీఆర్
యన్టీఆర్ పుట్టినరోజున డబుల్ ట్రీట్?

స్టార్ డైరెక్టర్లతోనే యన్టీఆర్ వరుస చిత్రాలు
పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా...?

ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చినట్టేనా..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. ఇక సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'కేజీఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ రోజుకో వార్త మాత్రం వస్తూనే ఉంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ పెద్ద ఎత్తున డేట్స్ కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమా పై ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు.
'పక్కా లోకల్’ సాంగ్‌తో ఎన్టీఆర్ కు మరోసారి వార్నర్ విషెస్..!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎన్టీఆర్ అభిమాని కోరిక మేరకు నిన్న ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. రేపు పుట్టినరోజు కావడంతో...జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపమని ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా డేవిడ్ వార్నర్ ను కోరగా "హ్యాపీ బర్త్ డే బడ్డీ" అంటూ ట్వీట్ చేసాడు.
ఎన్టీఆర్ కు బిగ్‌బాస్ టీమ్ స్పెషల్ వీడియో తో విషెస్..!
ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హవానే నడుస్తుంది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 టీమ్ కూడా ఎన్టీఆర్ కు స్పెషల్ వీడియో తో విషెస్ చెప్పారు.

ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ - ఫ్యాన్స్ ఫిదా
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 'ఆర్ఆర్ఆర్' చిత్రం నుంచి కొమురం భీమ్ పాత్రకు సంబంధించి వీడియో ప్రోమో వస్తుందని భావించిన అభిమానులు ఎంతగానో ఆశ పడ్డారు. కానీ ఆ సినిమా నుండి ఎలాంటి వీడియో కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదల చేయడం లేదని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశకు గురయ్యారు.ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు ఎలాంటి అప్ డేట్ లేదని నిరాశలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులకు నిన్న సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫొటో మామూలు కిక్ ఇవ్వలేదు.

ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎన్టీఆర్ బల్క్ డేట్స్...?
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈసినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'కేజీఎఫ్' చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గా కథను ప్రస్తుతం ప్రశాంత్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, కన్నడ, హిందీ భాషాల్లో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్ కు వార్నర్ బర్త్ డే విషెస్..!
మొత్తానికి లాక్ డౌన్ వల్ల క్రికెట్ మ్యాచ్ లు కూడా రద్దవడంతో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు మంచి టైం దొరికినట్టుంది. ఈ మధ్య తెలుగు సినిమా, పాటల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమా పాటలకు స్టెప్ లు వేయగా.. పోకిరి సినిమాలోని మహేష్ డైలాగ్, బాహుబలి సినిమాలోని డైలాగ్ చెప్పి అలరించాడు.
అభిమానులకు సర్ ప్రైజ్
"టెంపర్ ", "నాన్నకు ప్రేమతో ", "జనతా గ్యారేజ్ " , "జై లవకుశ " , "అరవింద సమేత వీర రాఘవ " వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక ,అభిమానులను అలరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం " మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. "RRR" మూవీ తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో #NTR 30 , బ్లాక్ బస్టర్ KGF చాప్టర్ 1 కన్నడ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం..!
మే 20న యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇక ఆ రోజు కోసం ఆర్ఆర్ఆర్ సినిమా నుండి తమ హీరో కు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ వస్తుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదని తెలిసింది. ఈ రోజు ఉదయమే చిత్రయూనిట్ లాక్ డౌన్ వల్ల కొన్ని టెక్నీకల్ ఇష్యూస్ వల్ల ఇంట్రడక్షన్ వీడియో కానీ.. ఫస్ట్ లుక్ కానీ విడుదల చేయలేకపోతున్నాం అని తెలిపారు. ఇక ఇప్పుడు దీనిపై ఎన్టీఆర్ కూడా స్పందించాడు. తన పుట్టిరోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉండాలని.. అందరూ ఇంట్లోనే ఉండాలని కోరాడు.

ఎన్టీఆర్ అభిమానులకు నిరాశే.. బర్త్ డే కి ఎలాంటి వీడియో లేదు..!
ఎన్టీఆర్ పుట్టిన రోజు కోసం అభిమానులు వేయి కళ్ళతో ఏడుస్తున్నారు. లాక్ డౌన్ కాబట్టి హీరోలు లు ఎలాగూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవట్లేదు.. ఇంకా అభిమానులను ఎలాగూ పుట్టినరోజు వేడుకలు జరపొద్దని చెపుతున్నారు. అయితే అభిమానులు ఎదురుచూసేది మాత్రం ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో కోసం. కానీ ఇప్పుడు వారి ఆశలకు నిరాశే ఎదురైంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు
జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ రికార్డ్
సక్సెస్ ఫుల్ "నిన్ను చూడాలని " మూవీ తో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "స్టూడెంట్ నెం 1", "ఆది ", "సింహాద్రి", "యమదొంగ ", "బృందావనం", "టెంపర్ ", "నాన్నకు ప్రేమతో ", "జనతా గ్యారేజ్ ", "జై లవకుశ ", "అరవింద సమేత వీర రాఘవ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్, డ్యాన్స్ లతో ప్రేక్షక , అభిమానులను అలరించారు. "యమదొంగ "మూవీ కి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ , "నాన్నకు ప్రేమతో " మూవీ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఎన్టీఆర్ అందుకున్నారు.
భారీ చిత్రాల హీరో ఎన్టీఆర్
టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ముందుండగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 400 కోట్ల తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో నటిస్తున్నారు.
అభిమానులకు శుభవార్త
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత #NTR30 మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనుంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కన్నడ మూవీ రికార్డ్స్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. #NTR30 మూవీ తరువాత ఈ మూవీ తెరకెక్కనుంది.
తన స్టాఫ్ కు అండగా నిలిచిన ఎన్టీఆర్..!
కరోనా నిర్మూలనలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు...రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నాయి. వాటితో పాటు పేదలకు అండగా నిలుస్తూ ఉదారత చాటుకుంటున్నారు చాలా మంది ప్రముఖులు. కేవలం సెలబ్రిటీస్ మాత్రమే కాదు.. సామాన్య ప్రజలు కూడా తమ స్థోమతకు తగిన విధంగా సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సినీ కార్మికుల కోసం చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో సాయం అందిస్తున్నారు.
"ఎన్టీఆర్ 30" లో మరో యంగ్ హీరో ?
హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా "ఎన్టీఆర్ 30" మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. "రౌద్రం రణం రుధిరం " మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ప్రారంభం అయ్యే ఈ మూవీ లో ఒక యంగ్ హీరో కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు.
మలయాళ భాష ప్రాక్టీస్ లో ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. అన్ని భాషలలోనూ తన పాత్ర కు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. హీరో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన "RRR" మూవీ వీడియో కి ఒక్క మలయాళ భాషలో తప్ప మిగతా భాషలన్నిటికీ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
యన్టీఆర్ పుట్టినరోజున డబుల్ ట్రీట్?
మే 20.. యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు వెరీ స్పెషల్ డే. ఎందుకంటే.. ఆ రోజు తారక్ పుట్టినరోజు. అభిమానులకు పండగ రోజు. అలాంటి రోజున తారక్ నుంచి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అందనుందని సమాచారం.

స్టార్ డైరెక్టర్లతోనే యన్టీఆర్ వరుస చిత్రాలు
యంగ్ టైగర్ యన్టీఆర్ ఈ మధ్య సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘అరవింద సమేత’ నుంచి అగ్ర దర్శకులతోనే వరుస చిత్రాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రీవియస్ మూవీ ‘అరవింద సమేత’ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో చేసిన తారక్.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’(‘రౌద్రం రణం రుధిరం’) ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్లో చేస్తున్నారు. మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామా.. 2021 సంక్రాంతికి రిలీజ్ కానుంది. కాగా, ఈ చిత్రం తరువాత తారక్ నుంచి రాబోతున్న సినిమాలు కూడా అగ్ర దర్శకుల కలయికలోనే…
పెళ్లి చూపులు డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా...?
మొదటి సినిమా పెళ్లి చూపులు సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇక తన తరువాత సినిమా వెంకీ ఉన్నట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి.
తలైవి మూవీ లో సీనియర్ ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్ ?
విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాణ సారథ్యం లో లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న తలైవి మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, లెజండరీ యాక్టర్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎమ్ జి రామచంద్రన్ పాత్రలో ట్యాలెంటెడ్ యాక్టర్ అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఇతర పాత్రలలో ప్రముఖ నటీనటులు నటించనున్నారు.