
ట్యాగ్ · 16 కథనాలు


సెన్సార్ పూర్తి చేసుకున్న 'సన్ ఆఫ్ ఇండియా'..!

'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్ రిలీజ్

మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' రిలీజ్ డేట్ ఫిక్స్

చిరు సర్ ప్రైజ్ చేయాలనుకున్నాడు..!

'సన్ ఆఫ్ ఇండియా'-సూర్య చేతుల మీదుగా టీజర్

"సన్ ఆఫ్ ఇండియా " మూవీ టీజర్ రిలీజ్ డేట్

ట్రెండింగ్ లో మోహన్ బాబు బర్త్ డే సీడీపీ

రజినీ పొలిటిల్ ఎంట్రీ పై మోహన్ బాబు రియాక్షన్
ఆ వార్తల్లో నిజం లేదు - ఆ సినిమాలో నటించట్లేదు
'సన్ ఆఫ్ ఇండియా' - హెద్రాబాద్ షెడ్యూల్ ప్రారంభం
మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' షూటింగ్ ప్రారంభం

'అగ్ని నక్షత్రం'.. 'ప్రొఫెసర్ విశ్వామిత్ర'గా మోహన్ బాబు..!
ప్రస్తుతం మోహన్ బాబు పలు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే సన్నాఫ్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది నిరాశనే మిగిల్చింది. ఇక ఇప్పుడు మరో సినిమాలో కీలక పాత్రతో వచ్చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు, లక్ష్మీ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే ఈసినిమాను ఎప్పుడో ప్రారంభించారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేస్తూ రిలీజ్ చేశారు. అగ్నినక్షత్రం అనే టైటిల్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఇలాంటి జోనర్స్ అందరూ చూడాలంటే కొంచం కష్టమే ముఖ్యంగా యూత్ కి. అయితే ఫ్యాన్స్.. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈసినిమా నచ్చుతుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సన్ ఆఫ్ ఇండియా'..!
'కలెక్షన్ కింగ్' మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు, ఎన్నో పాత్రలు చేశారు. కేవలం హీరోగా మాత్రమే కాదు.. విలన్ గా పలు పాత్రలు చేశారు. అంతేకాదు నిర్మాతగా పలు సినిమాలు కూడా నిర్మించారు. ఇక గతకొంతకాలంగా హీరోగా సినిమాలు చేయకపోయినా.. పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా వస్తుంది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా చేస్తున్నాడు.

'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్ రిలీజ్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా సినిమాలు చేసి చాలా కాలమైంది. అయితే పలు సినిమాల్లో కొన్ని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియాఅనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' రిలీజ్ డేట్ ఫిక్స్
మళ్లీ ఇండస్ట్రీలో సందడి మొదలైంది. ఒకరి తరువాత ఒకరు వరుసపెట్టి సినిమా రిలీజ్ డేట్లను ప్రకటించేస్తున్నారు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఎలాగూ ఫిక్స్ అయిపోవడంతో చిన్న సినిమాలు.. మినిమం బడ్జెట్ సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా సినిమా రిలీజ్ డేట్లను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఎన్నో రోజుల నుండి పెండింగ్ లో ఉన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఈ సినిమా గ్లింప్స్ ని కూడా గతంలో రిలీజ్ చేశారు.

చిరు సర్ ప్రైజ్ చేయాలనుకున్నాడు..!
రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సన్ ఆఫ్ ఇండియా. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా నేడు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం సర్ ప్రైజింగ్ ఎలిమెంట్. ఇక తన టీజర్ కు వాయిస్ ఓవర్ అందించినందుకు చిరు పై ప్రశంసలు కురిపిస్తూ ఒక లేఖ విడుదల చేశాడు మోహన్ బాబు.

'సన్ ఆఫ్ ఇండియా'-సూర్య చేతుల మీదుగా టీజర్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా అనే సందేశాత్మక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో పలు దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరో సారి అదే జోనర్ తో వచ్చేస్తున్నాడు. రత్నబాబు దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఈసినిమా నుండి టీజర్ కూడా వచ్చేస్తుంది.

"సన్ ఆఫ్ ఇండియా " మూవీ టీజర్ రిలీజ్ డేట్
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై డైమండ్ రత్న బాబు దర్శకత్వంలో విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరో గా సందేశాత్మక చిత్రం "సన్ ఆఫ్ ఇండియా " తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ , తనికెళ్ళ భరణి , అలీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ట్రెండింగ్ లో మోహన్ బాబు బర్త్ డే సీడీపీ
హీరో , విలన్ , కామెడీ విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన మోహన్ బాబు విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ గా పేరుపొందారు. ఈ రోజు మోహన్ బాబు తన 69 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అద్భుతమైన డైలాగ్ డెలివరీ , పెర్ఫార్మెన్స్ తో నాలుగున్నర దశాబ్దాలుగా మోహన్ బాబు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. 500 మూవీస్ కు పైగా నటించిన మోహన్ బాబు "పద్మశ్రీ "అవార్డ్ అందుకున్నారు.
'సన్ ఆఫ్ ఇండియా' - మోహన్ బాబు, ఇళయ రాజా ఆసక్తికర సంభాషణ
గతంలో పలు దేశభక్తి సినిమాల్లో నటించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరో సారి అదే జోనర్ తో వచ్చేస్తున్నాడు. రత్నబాబు దర్శకత్వంలో మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'సన్ ఆఫ్ ఇండియా'. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్ రిలీజ్
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి నిర్మించిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గత కొద్దికాలంగా చాలా తక్కువ సినిమాల్లో కినిపించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ' ఆకాశం నీ హద్దురా..!' సినిమాలో భక్త వత్సల నాయుడు అనే కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు దేశభక్తి నేపథ్యంలో వస్తున్న 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమాతో పూర్తి స్థాయి పాత్రతో వస్తున్నాడు. రత్నబాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో పడింది.
'సన్ ఆఫ్ ఇండియా' నుండి రానున్న ఫస్ట్ లుక్
రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్ళింది. అయితే కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మళ్లీ మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా నుండి టైటిల్ పోస్టర్ అప్ డేట్ తప్పా ఇంతవరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు.

రజినీ పొలిటిల్ ఎంట్రీ పై మోహన్ బాబు రియాక్షన్
ఎంతో కాలంగా రజినీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అభిమానులతో పాటు అందరూ ఎదురుచూస్తున్నారు . అయితే ఇటీవలే రాజకీయాల్లోకి వస్తున్నానని.. డిసెంబర్ 31న తన పార్టీ పేరుని అనౌన్స్ చేస్తానని, జనవరిలో పార్టీని స్టార్ట్ చేస్తానని ఆయన తెలియజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రోజు కోసం ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లోనే మరో ట్విస్ట్ ఇచ్చారు రజినీ. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రారంభిచలేనంటూ ట్విట్టర్ వేదికగా ఒక లేఖను విడుదల చేశారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని .. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అభిమానులను కోరారు. రాజకీయ ప్రకటనకు ముందు…
ఆ వార్తల్లో నిజం లేదు - ఆ సినిమాలో నటించట్లేదు
రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దీనితో పాటు నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెక్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుండి రకుల్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.
'సన్ ఆఫ్ ఇండియా' - హెద్రాబాద్ షెడ్యూల్ ప్రారంభం
రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న దేశభక్తి కథా చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా. అందుకే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో మోహన్‌బాబు ఈ సినిమాలో కనిపిస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే ప్రారంభించారు చిత్రయూనిట్.
మోహన్ బాబు 'సన్ ఆఫ్ ఇండియా' షూటింగ్ ప్రారంభం
రత్నబాబు దర్శకత్వంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. 'సన్ ఆఫ్ ఇండియా' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ ను కూడా అప్పుడే విడుదల చేశారు. అయితే కరోనా వల్ల ఇన్నిరోజులు షూటింగ్ కు వెళ్ళలేదు ఈ సినిమా.