మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. చాలా గ్యాప్ తరువాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. మరి ఈసినిమా ఎలా ఉంది.. చాలా రోజుల తర్వాత వస్తున్న మోహన్ బాబు ఎలా అలరించారు అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీ నటులు.. మంచు మోహన్ బాబు, మీనా, శ్రీకాంత్, రాజా రవీంద్ర, నరేష్, పోసాని కృష్ణ మురళి, మంగ్లీ, ప్రగ్యా జైశ్వాల్, పృథ్వీ, అలీ, సునీల్, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తది తరులు
దర్శకుడు.. డైమండ్ రత్నబాబు
నిర్మాత.. మంచు విష్ణు
బ్యానర్స్..24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్
సంగీతం.. ఇళయరాజా
సినిమాటోగ్రఫి.. సర్వేష్ మురారి
కథ
కేంద్ర మంత్రి (శ్రీకాంత్), దేవాదాయ శాఖా మంత్రి (రాజా రవీంద్ర), ఓ లేడీ డాక్టర్‌ను విరూపాక్ష (మోహన్ బాబు) కిడ్నాప్ చేస్తాడు. వారి ముగ్గురిని తన ప్రైవేట్ జైలులో బంధిస్తాడు. దాంతో రాష్ట్రంలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడుతుంది. ఇక వారిని ఎవరు కిడ్నాప్ చేసిందనే విషయాన్ని పోలీసులు కనుక్కోలేకపోవడంతో.. ఎన్ఐఏకి చెందిన ఆఫీసర్ (ప్రగ్యా జైశ్వాల్) రంగంలోకి దిగుతుంది. ఆ క్రమంలో ఆమెకు జైలులో ఖైదీగా శిక్షను అనుభవించిన విరూపాక్షనే ఈ కిడ్నాప్స్ చేశాడనే నిజం తెలుస్తుంది. అసలు విరూపాక్ష ఎవరు? అతనెందుకు ఖైదీగా జైలు శిక్షను అనుభవించాడు. ఎందుకు కిడ్నాప్స్ చేశాడు. కిడ్నాప్ చేసిన రాజకీయ నాయకులకు, విరూపాక్షకు సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇది పొలిటికల్ సెటైర్ సినిమా అని చెప్పొచ్చు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. అలానే లా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అన్న పాయింట్ పై రత్నబాబు సినిమా చూపించాడు. అందుబాటులో ఉండాల్సిన న్యాయం గురించి, తప్పుడు కేసులతో జైలులో శిక్షలు అనుభవిస్తున్న నిరపరాధుల గురించి, ప్రైవేటు జైళ్ల గురించి ప్రస్తావించిన తీరు బావుంది. ఇక మోహన్ బాబు హీరో కాబట్టి తనతో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పి ఆలోచింపే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇక ఈసినిమాను తక్కువ రన్ టైమ్ లోనే ముగించాడు. ఇదే ఈసినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఫస్టాఫ్ అంతా కిడ్నాపులు చేయడం అనే పాయింట్ చుట్టూ కథ నడిపి, తర్వాత ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చిందనే పాయింట్ మీద సెకండాఫ్‌ను రాసుకున్నాడు.
ఇక మెహన్ బాబు నటన గురించి చెప్పేదేముంది. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలతో అలరించారు. ఆయన చేయని పాత్ర కాదు ఇది. గతంలోనే దేశభక్తి కి సంబంధించి ఇలాంటి పాత్రలు ఎన్నో చేసేశారు. చూడాల్సింది కథ ఎలా ఉందన్నది మాత్రమే. ఈసినిమాలో కూడా ఎప్పటిలాగే తనదైన హావ భావాలు, డైలాగులతో మెప్పించారు. సినిమా అంతటినీ తానై ముందుకు నడిపించారాయన. ఇక మోహన్ బాబు సినిమానే కాబట్టి ఎక్కువ భాగం ఆయనమీదే నడుస్తుంది. మిగిలిన పాత్రల నిడివి కాస్త తక్కువ ఉన్నప్పటికీ వారి పాత్రల మేర బాగానే నటించారు.
ఈసినిమాకు సంగీతం ఇళయరాజా అందించడం మరో ఇంట్రెస్టింగ్ థింగ్. ఇక ఇళయరాజా మ్యాజిక్ సినిమా మొదలైనప్పటినుండీ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. తమ హోమ్ బ్యానర్సే కాబట్టి ఎక్కడా రాజీపడకుండా రిచ్ గానే నిర్మించారు.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఇలాంటి జోనర్స్ అందరూ చూడాలంటే కొంచం కష్టమే ముఖ్యంగా యూత్ కి. అయితే ఫ్యాన్స్.. ఇలాంటి సినిమాలను ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈసినిమా నచ్చుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: