ఆ వార్తల్లో నిజం లేదు – ఆ సినిమాలో నటించట్లేదు

Rakul Preet Singh Confirms That She Is Not Playing A Part Of Son Of India Movie

రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దీనితో పాటు నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చెక్ సినిమాలో కూడా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుండి రకుల్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా మోహన్‌బాబు ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో రకుల్‌ నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రకుల్ మేనేజర్‌ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. రకుల్ ఆ సినిమాలో నటించట్లేదని స్పష్టం చేశారు. మరి ఇప్పుడైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం.

ఇవికాక రకుల్ ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో ‘మేడే’ అనే చిత్రానికి స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించడానికి రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =