
ట్యాగ్ · 17 కథనాలు


అతి త్వరలో ఆయ్ చూస్తా -హరీష్ శంకర్

హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్..

ఉస్తాద్ కోసం భారీ సెట్- త్వరలో షూటింగ్

ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉస్తాద్ భగత్ సింగ్

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!

"భీమ్లా నాయక్"మూవీ పై హరీష్ శంకర్ స్పందన

"భవదీయుడు భగత్ సింగ్ "మూవీ అప్ డేట్

లొకేషన్స్ వేటలో 'భవదీయుడు భగత్ సింగ్' టీమ్

"వేదాంతం రాఘవయ్య " మూవీ లో సత్యదేవ్

'సాయి తేజ్' ఫిట్ గా ఉన్నాడు..!

పవన్ కళ్యాణ్ కు జోడీగా పూజాహెగ్డే

పవన్-హరీష్ సినిమా టైటిల్ రిలీజ్

లెక్చరర్ గా పవన్ కళ్యాణ్

ఓ భామ అయ్యో రామ.. అతిథి పాత్రలో స్టార్ డైరెక్టర్
యువ కథానాయకుడు సుహాస్ తన విభిన్నమైన స్టొరీ సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ, మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘ఓ భామ అయ్యో రామ’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ ('జో' ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది.

అతి త్వరలో ఆయ్ చూస్తా -హరీష్ శంకర్
నిన్న రిలీజైన సినిమాల్లో అన్నికంటే ఎక్కవగా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న సినిమా ఆయ్.మ్యాడ్ ఫేమ్ నార్నె నితిన్ హీరోగా నటించిన ఈసినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కింది.ఇందులో కామెడీ అలాగే చివరి 20నిమిషాలుహైలైట్ అయ్యాయి.ఈసినిమా చూసినా వారందరు బాగుందని అంటున్నారు.దాంతో చిన్న సినిమా గా వచ్చిన ఆయ్ ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.అంజి మణిపుత్ర ఈసినిమాను డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ నిర్మించింది.

హరీష్ శంకర్ బర్త్ డే స్పెషల్..
పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ సినిమాలను అందించే డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్. షాక్ తో డైరెక్టర్ గా ఎంట్రీ గా ఇచ్చిన హరీష్ కు రవితేజ తో తీసిన మిరపకాయ్ ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. షాక్ ప్రశంసలు అందుకున్న కమర్షియల్ గా అంత వర్క్ అవుట్ అవ్వలేదు. అయినా హరీష్ ట్యాలెంట్ చూసి రవితేజ రెండో సారి నమ్మి అవకాశం ఇచ్చాడు అయితే ఈ సారి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హరీష్. 2011 లో విడుదలైన ఈచిత్రం ఆ ఏడాది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత హరీష్ ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. హరీష్ కెరీర్ బెస్ట్ మూవీ కూడా ఇదే.

ఉస్తాద్ కోసం భారీ సెట్- త్వరలో షూటింగ్
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమాల్లో హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాను ప్రకటించిన దగ్గరనుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాకు ముందు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను అనుకున్నారు.. ఆతరువాత ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు. ఇక ఈసినిమా గురించి తాజాగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కోసం భారీ సెట్ ను వేసినట్టు చెబుతూ ఫొటోస్ షేర్ చేశారు. అంతేకాదు షూటింగ్ కూడా త్వరలో మొదలుపెట్టనున్నట్టు కూడా చెప్పారు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉస్తాద్ భగత్ సింగ్
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్, భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరిహర వీరమల్లు మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

'పవన్' సినిమా పై 'హరీష్' ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసినిమా కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎప్పుడో ప్రకటించినా కూడా ఇప్పటి వరకూ సైట్స్ పైకి వెళ్లలేదు. కరోనా పాండమిక్ వల్ల, అలానే పవన్ కమిట్ అయిన సినిమాల వల్ల ఈసినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇక హరీష్ కూడా గద్దలకొండ గణేష్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ఇప్పటివరకూ మరో సినిమాను తీయలేదు. పవన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే పవన్ సినిమాకోసం ఎదురుచూడటంలో తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెబుతున్నాడు హరీష్ శంకర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హరీష్ శంకర్ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

"భవదీయుడు భగత్ సింగ్" మూవీ లో ప్రొఫెసర్ గా పవన్ కళ్యాణ్?
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూ పొందిన యాక్షన్ కామెడీ “గబ్బర్ సింగ్ “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా "గబ్బర్ సింగ్ " మూవీ ని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించారు. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది.

పవన్ సినిమాపై హరీష్ శంకర్.. తరువాత చెబుతా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస బ్లాక్ బస్టర్ లతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ఖాతా తెరిచిన పవన్ ఈ ఏడాది భీమ్లానాయక్ తో మరో సంచలన విజయం సాధించారు. బాక్సాఫీస్ వద్ద ఈసినిమా ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీంతో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా, అలానే హరీష్ శంకర్ తో మరో సినిమా చేయబోతున్నాడు. వీటిలో క్రిష్ హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు.

"భీమ్లా నాయక్"మూవీ పై హరీష్ శంకర్ స్పందన
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఈ రోజు (25 వ తేదీ) భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.“భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.

"భవదీయుడు భగత్ సింగ్ "మూవీ అప్ డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన "గబ్బర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే. మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "భవదీయుడు భగత్ సింగ్ "మూవీ తెరకెక్కనుంది. పూజాహెగ్డే కథానాయిక. అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయినా ఈ మూవీ పై ఏ ఒక్క అప్ డేట్ రాలేదని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

లొకేషన్స్ వేటలో 'భవదీయుడు భగత్ సింగ్' టీమ్
రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ముందు వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇవ్వగా ఆసినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంగా చేస్తున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈసినిమాను సితార ఎంటర్టైనర్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

"వేదాంతం రాఘవయ్య " మూవీ లో సత్యదేవ్
పలు మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సత్యదేవ్ "బ్లఫ్ మాస్టర్"మూవీ తో హీరోగా మరారు. సక్సెస్ ఫుల్ "ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం "గుర్తుందా శీతాకాలం", "గాడ్సే", "స్కైలాబ్ " మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. "రామ్ సేతు" హిందీ మూవీ లో సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యదేవ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

“భవదీయుడు భగత్ సింగ్”మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడీగా పూజాహెగ్డే
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా “భవదీయుడు భగత్ సింగ్”మూవీ తెరకెక్కనుంది.బ్లాక్ బస్టర్ “గబ్బర్ సింగ్ ” మూవీ తరువాత దర్శకుడు హరీష్ శంకర్ , హీరో పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ మూవీ లో కథానాయికగా పూజాహెగ్డే ఎంపిక అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “దువ్వాడ జగన్నాథమ్ “,”గద్దలకొండ గణేష్ “మూవీస్ ఘనవిజయం సాధించాయి.

'సాయి తేజ్' ఫిట్ గా ఉన్నాడు..!
మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, రెండు మూడు వారాలు హాస్పిటల్ లోనే ఉండటం, రీసెంట్ గా డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే కదా. దసరా పండుగ రోజు సాయి తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అందుకుగాను మెగా కాంపౌండ్ మొత్తం సాయ్ తేజ్ కు వెల్ కమ్ చెప్పారు. అంతేకాదు తేజ్ హెల్త్ అప్ డేట్స్ కూడా మెగా హీరోలు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సాయి తేజ్ ను కలువగా తాాజాగా హరీష్ శంకర్ కూడా తేజ్ ను కలవడం జరిగింది. ఈ విషయాన్ని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. నా బ్రదర్ సాయ్ తేజ్ ను కలవడం జరిగింది.. తను చాలా ఫిట్ గా ఉన్నాడు.. ఈ విషయం పంచుకుంటున్నందుకు చాలా…

పవన్ కళ్యాణ్ కు జోడీగా పూజాహెగ్డే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న "భీమ్లా నాయక్" , క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు" మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "భీమ్లా నాయక్" మూవీ 2022 జనవరి 12 వ తేదీ , "హరిహర వీరమల్లు" మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

పవన్-హరీష్ సినిమా టైటిల్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా టైమ్ ఉన్నా ఈ గ్యాప్ లో పలు అప్ డేట్స్ మాత్రం ఇస్తూ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇప్పటికే పవర్ బర్త్ డే కు ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా.. ఈరోజు పవర్ ప్యాక్డ్ అనౌన్స్మెంట్ ఉందని చిత్రయూనిట్ నిన్న ప్రకటించింది. దీంతో అందరూ ఫస్ట్ లుక్ కు సంబంధించిన ఏదైనా అప్ డేట్ ఉంటుందేమో అని ఊహించారు.

లెక్చరర్ గా పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “, మలయాళ సూపర్ హిట్ "అయ్యప్పనుమ్ కోషియమ్ " మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన "గబ్బర్ సింగ్ "మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.