నిన్న రిలీజైన సినిమాల్లో అన్నికంటే ఎక్కవగా పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న సినిమా ఆయ్.మ్యాడ్ ఫేమ్ నార్నె నితిన్ హీరోగా నటించిన ఈసినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో తెరకెక్కింది.ఇందులో కామెడీ అలాగే చివరి 20నిమిషాలుహైలైట్ అయ్యాయి.ఈసినిమా చూసినా వారందరు బాగుందని అంటున్నారు.దాంతో చిన్న సినిమా గా వచ్చిన ఆయ్ ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.అంజి మణిపుత్ర ఈసినిమాను డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ నిర్మించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను నేను కూడా అతి త్వరలో చూస్తానంటున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్.ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న హరీష్, ఆయ్ గురించి చాలా గొప్పగా విన్నానని అతి త్వరలో సినిమా చూస్తానని ట్వీట్ చేశాడు.
ఇక హరీష్ డైరెక్షన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ కూడా నిన్ననే విడుదలైయింది.మొదటి రోజు ఈసినిమా మంచి వసూళ్లను దక్కించుకుంది.మాస్ మహారాజా రవితేజ యాక్టింగ్, హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే గ్లామర్ ,సత్య కామెడీ, సాంగ్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.హిందీ సూపర్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ కు మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: