యువ కథానాయకుడు సుహాస్ తన విభిన్నమైన స్టొరీ సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ, మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘ఓ భామ అయ్యో రామ’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ (‘జో’ ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాను రామ్ గోధల తన తొలి ప్రయత్నంగా దర్శకత్వం చేస్తున్నారు. అనితా హస్సానందని, అలీ, బబ్లూ పృథ్వీ రాజ్, రవీందర్ విజయ్, మొయిన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అందించారు మేకర్స్. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఓ స్టార్ డైరెక్టర్ కనిపించనున్నారు.
‘మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాధం’ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ ఇందులో ఒక అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ మేరకు తాజాగా చిత్ర బృందం ఆయనకు స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా, కథలో మరిన్ని అంశాలను అందించేందుకు సీనియర్ నటి అనితా హసనందిని మరియు ప్రముఖ నటుడు అలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ఈ చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక బృందం పనిచేస్తోంది. మణికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ సంగీతాన్ని అందిస్తున్నారు. భవిన్ షా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌ను సమకూరుస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హరీష్ నల్ల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























