
ట్యాగ్ · 18 కథనాలు


సందీప్ రెడ్డి తో దేవర టీం.. ప్రోమో రిలీజ్

సందీప్ రెడ్డితో ఎన్టీఆర్

స్పిరిట్ ఆ జోనర్ కాదంటున్న సందీప్ వంగా

రణ్బీర్ కపూర్-రష్మిక 'యానిమల్' షూటింగ్ ప్రారంభం..!

ప్రభాస్ "స్పిరిట్ " 8 భాషలలో రిలీజ్

మహేష్ తో సినిమా పక్కా.. కానీ..!
ఇకపై నా సినిమాను నేనే నిర్మించుకుంటా..!

కట్ చేసిన సీన్లతో 'అర్జున్ రెడ్డి' రీ రిలీజ్..!

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "అర్జున్ రెడ్డి "
అర్జున్ రెడ్డి కాంబినేషన్ మరోసారి..?
తెలుగు వెబ్ సిరీస్ లో పాయల్ రాజ్ పుత్
పాయల్ రాజ్ పుత్ డ్రీమ్ ప్రాజెక్ట్స్
ఆ డైరెక్టర్ తో పనిచేయాలని ఉంది..!

మెగాస్టార్ తో సినిమా ప్లాన్..!

అప్పుడు మజిలీ …ఇప్పుడు తండేల్ - సందీప్ రెడ్డి వంగా
నాగచైతన్య, సాయి పల్లవి మచ్ అవైటెడ్ మూవీ తండేల్ ఈ వారంలోనే థియేటర్లలోకి వస్తుంది.ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది.ఇక నిన్న హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. దీనికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా వచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావాల్సివుంది కానీ హెల్త్ ఇష్యూ వల్ల రాలేకయాడు.

సందీప్ రెడ్డి తో దేవర టీం.. ప్రోమో రిలీజ్
ఎన్టీఆర్ -కొరటాల శివల దేవర పార్ట్ 1 ఈనెల 27న విడుదలకానుందని తెలిసిందే.పాన్ ఇండియా మూవీ కావడంతో హిందీ లోనూ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా యానిమల్ ఫేమ్ తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ,దేవర టీం ను ఇంటర్వ్యూ చేశాడు.ముంబై లో ఈ ఇంటర్వ్యూ ను షూట్ చేశారు.ఇందులో ఎన్టీఆర్ తో పాటు,కొరటాల శివ అలాగే విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ జాన్వీ కపూర్ పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ తో రానుంది. ఈరోజు ప్రోమో ను కూడా విడుదలచేశారు.రేపు ఫుల్ ఇంటర్వ్యూ రానుంది.ఈ ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సందీప్ రెడ్డితో ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.ఈసినిమా రెండు భాగాలుగా విడుదలకానుండగా ఫస్ట్ పార్ట్ఈనెల 27న రానుంది.రిలీజ్ కు సమయం దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీం.అందులో భాగంగా రీసెంట్ గా రిలీజైనా సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.రేపు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇందుకోసం ఎన్టీఆర్ ఇప్పటికే ముంబై చేరుకున్నాడు.రేపు అక్కడ ట్రైలర్ ఈవెంట్ జరుపనున్నారు.

స్పిరిట్ ఆ జోనర్ కాదంటున్న సందీప్ వంగా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి 2898 ఏడి సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

మెగాస్టార్ చిరంజీవితో అలాంటి సినిమా తీస్తా - సందీప్ వంగా
సందీప్ రెడ్డి వంగా.. ఈ తెలుగు డైరెక్టర్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించిన ఆయన.. తన తదుపరి సినిమాకు కూడా మళ్ళీ బాలీవుడ్‌నే ఎంచుకున్నాడు. ఈసారి రణ్‌బీర్ కపూర్ హీరోగా హిందీలో ‘యానిమల్’ సినిమాను రూపొందించి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ మూవీ అనౌన్స్ మెంట్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా రాణిస్తున్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక, అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీతో అల్లు…

రణ్బీర్ కపూర్-రష్మిక 'యానిమల్' షూటింగ్ ప్రారంభం..!
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కూడా. యానిమల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

ప్రభాస్ "స్పిరిట్ " 8 భాషలలో రిలీజ్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణ లో యువి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజేహెగ్దే జంటగా రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”, తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆది పురుష్“ , పాన్ వరల్డ్ మూవీ "ప్రాజెక్టు K " మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి. హీరో ప్రభాస్ సిల్వర్ జూబ్లీ మూవీ అనౌన్స్ మెంట్ నిన్న జరిగిన విషయం తెలిసిందే.

అఫీషియల్.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో 'ప్రభాస్ 25'
ఒకప్పుడు అంటే హీరోలు ఏడాదికే వరసుపెట్టి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు కాబట్టి చేసే సినిమాల సంఖ్య కూడా తగ్గిపోయింది. అందుకే సిల్వర్ జూబ్లీ సినిమా అంటే 25వ సినిమానే ఎంతో ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభాస్ సిల్వర్ జూబ్లీ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. ప్రభాస్ 25వ సినిమా గురించి అప్ డేట్ వస్తుందని ఎప్పుడైతే ప్రకటన వచ్చిందో అప్పటి నుండి ఫ్యాన్స్ తో పాటు అందరూ ఆ అప్ డేట్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా తాజాగా ప్రభాస్ 25వ సినిమా అప్ డేట్ వచ్చేసింది.

మహేష్ తో సినిమా పక్కా.. కానీ..!
'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు డైరెక్టర్ సందీప్ వంగా. అప్పటి వరకూ ఒకే ధోరణిలో ఉన్న సినిమాలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు వచ్చిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకోండి. కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన మార్క్ ను చూపించాడు. ఇక కబీర్ సింగ్ ఎఫెక్ట్ తో సందీప్ వంగా రేంజ్ కూడా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు సందీప్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరోలు కూడా రెడీగా ఉన్నారు.
ఇకపై నా సినిమాను నేనే నిర్మించుకుంటా..!
అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగా తెలుగులో ఎన్ని సంచలనాలు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇక్కడ అర్జున్ రెడ్డి సినిమాతో హిట్ కొట్టి ఏకంగా బాలీవుడ్ లో డైరెక్ట్ చేసే అవకాశాన్ని కొట్టేసాడు సందీప్ వంగా. సందీప్ వంగా డైరెక్షన్ చేస్తేనే రీమేక్ చేస్తానని షాహిద్ కపూర్ చెప్పాడంటేనే అర్ధం చేసుకోవచ్చు సందీప్ కి ఎంత క్రేజ్ ఉందో. ఇక షాహిద్ కోరిక మేరకు హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

కట్ చేసిన సీన్లతో 'అర్జున్ రెడ్డి' రీ రిలీజ్..!
సందీప్ వంగా-విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్త బోల్డ్ అండ్ కల్ట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా యూత్ కి ఎంత నచ్చేసిందో ఆ సినిమా సక్సెస్ ను బట్టి చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా మారడమే కాకుండా ఈ సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసాడు. అన్ని రకాలుగా కూడా ఈ సినిమా కొన్ని లిమిట్స్ ను చెరిపేసింది. మాములుగా అయితే ఒక సినిమా నిడివి 2 గంటల 30 నిముషాలు ఉంటుంది. దర్శకనిర్మాతలు కూడా అంత కంటే ఎక్కువ ఉన్నా ప్రేక్షకులను ఎక్కడ విసుగు వస్తుందో అని ట్రిమ్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా నిడివి 3 గంటలకు పైనే ఉంటుంది. కథలో కంటెంట్ ఉండాలి కానీ టైం…

3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న "అర్జున్ రెడ్డి "
భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "అర్జున్ రెడ్డి" మూవీ 2017 సంవత్సరం ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. షాలిని పాండే కథానాయిక. "అర్జున్ రెడ్డి" మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్రస్టేటెడ్ లవర్ గా విజయ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అభిమానులలో తనపెర్ఫార్మెన్స్ తో విజయ్ క్రేజ్ ను పెంపొందించుకున్నారు. "అర్జున్ రెడ్డి" మూవీ సందీప్ రెడ్డి వంగ కు దర్శకుడిగా మొదటి చిత్రం కావడం విశేషం.
అర్జున్ రెడ్డి కాంబినేషన్ మరోసారి..?
సందీప్ రెడ్డి డైరెక్టర్ గా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జనరేషన్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసిన సినిమా 'అర్జున్ రెడ్డి. ఆ చిత్రంతోనే హీరో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఇక ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇక తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా సందీప్ వంగానే డైరెక్ట్ చేయగా..షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు షాహిద్…
తెలుగు వెబ్ సిరీస్ లో పాయల్ రాజ్ పుత్
భారత చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది. హిందీ , తమిళ , తెలుగు భాషలలో వెబ్ సిరీస్ లు రూపొందుతున్న విషయం తెలిసిందే. వెబ్ సిరీస్ తో పాటు మూవీస్ కూడా OTT ప్లాట్ ఫారం లో ప్రదర్శిస్తున్నారు. OTT ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతామనే ఆలోచనతో స్టార్ హీరోయిన్స్ తో పాటు యంగ్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపుతున్నారు.
పాయల్ రాజ్ పుత్ డ్రీమ్ ప్రాజెక్ట్స్
సూపర్ హిట్ "RX 100" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్ ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న పాయల్ "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం "నరేంద్ర "(తెలుగు ), "ఏంజెల్" (తమిళ) మూవీస్ లో నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను పాయల్ తెలిపారు.
ఆ డైరెక్టర్ తో పనిచేయాలని ఉంది..!
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కొంతమంది హీరోయిన్స్ కి కొంతమంది హీరోలతో.. డైరెక్టర్స్ తో పనిచేయాలనే డ్రీమ్ ఉంటుంది. ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కైతే తాను అనుకున్న హీరోతో చేయొచ్చు.. హీరోల సంగతి తెలిసిందే... హీరోయిన్స్ కు కొంచం కష్టమే.. ఎందుకంటే స్టార్ హీరోయిన్ హోదా వస్తేనే తప్పా వారు అనుకున్న హీరోలతో... డైరెక్టర్స్ తో చేయడానికి అవకాశం రాదు. అది కూడా ఒక్కోసారి కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఉపోద్గాతం అంత ఎందుకంటే పాయల్ రాజ్ పుత్ కూడా తన డ్రీమ్ హీరోస్ గురించి చెపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ రాజ్ పుత్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో రవితేజ, ప్రభాస్ తన…

మెగాస్టార్ తో సినిమా ప్లాన్..!
తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ వంగ బాలీవుడ్ లో కూడా 'కబీర్ సింగ్' రీమేక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. షాహిద్ కపూర్, కియారా అద్వాని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ రీమేక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా.. సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. సందీప్ వంగ రీమేక్ చేస్తేనే తాను నటిస్తానని షాహిద్ కపూర్ చెప్పాడంటే.. సందీప్ పై ఎంత నమ్మకం ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ లోనే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. కబీర్ సింగ్ నిర్మాతలు అయిన టీ సీరిస్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు.