ఎన్టీఆర్ -కొరటాల శివల దేవర పార్ట్ 1 ఈనెల 27న విడుదలకానుందని తెలిసిందే.పాన్ ఇండియా మూవీ కావడంతో హిందీ లోనూ గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా యానిమల్ ఫేమ్ తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ,దేవర టీం ను ఇంటర్వ్యూ చేశాడు.ముంబై లో ఈ ఇంటర్వ్యూ ను షూట్ చేశారు.ఇందులో ఎన్టీఆర్ తో పాటు,కొరటాల శివ అలాగే విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ జాన్వీ కపూర్ పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ తో రానుంది. ఈరోజు ప్రోమో ను కూడా విడుదలచేశారు.రేపు ఫుల్ ఇంటర్వ్యూ రానుంది.ఈ ఇంటర్వ్యూ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక అంతటితో సరిపెట్టకుండా రీచ్ కోసం ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో లోకూడా పాల్గొంది దేవర టీమ్.హిందీలో కపిల్ శర్మ షోస్ చాలా పాపులర్.దాంతో ప్రమోషన్స్ లో భాగంగా దేవర టీం ఈషో లో పాల్గొంది.నెట్ ఫ్లిక్స్ లో ఈషో అందుబాటులోకి రానుండగా ఈనెల 21న ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.
ఇక తెలుగులో కూడా భారీగా ప్రమోషన్స్ ను ప్లాన్ చేశారు.అందులో భాగంగా ఎన్టీఆర్,కొరటాల శివను యువ హీరోలు విశ్వక్ సేన్,సిద్దు జొన్నలగడ్డల ఇంటర్వ్యూ చేశారు.త్వరలోనే ఈ ఇంటర్వ్యూ రిలీజ్ కానుంది.మరోవైపు ఓ భారీ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేశారు.దీనికి అనిరుధ్ తీసుకురావాలని అనుకుంటున్నారు.మొత్తానికి రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో దేవరకు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























