కట్ చేసిన సీన్లతో ‘అర్జున్ రెడ్డి’ రీ రిలీజ్..!

Director Sandeep Reddy Vanga To Release Arjun Reddy Once Again With All The Deleted Scenes

సందీప్ వంగా-విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాస్త బోల్డ్ అండ్ కల్ట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా యూత్ కి ఎంత నచ్చేసిందో ఆ సినిమా సక్సెస్ ను బట్టి చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా మారడమే కాకుండా ఈ సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేసాడు. అన్ని రకాలుగా కూడా ఈ సినిమా కొన్ని లిమిట్స్ ను చెరిపేసింది. మాములుగా అయితే ఒక సినిమా నిడివి 2 గంటల 30 నిముషాలు ఉంటుంది. దర్శకనిర్మాతలు కూడా అంత కంటే ఎక్కువ ఉన్నా ప్రేక్షకులను ఎక్కడ విసుగు వస్తుందో అని ట్రిమ్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా నిడివి 3 గంటలకు పైనే ఉంటుంది. కథలో కంటెంట్ ఉండాలి కానీ టైం లిమిట్ తో పనిలేదు అని ఈ సినిమాతో ఆడియన్స్ మరోసారి నిరూపించారు. ఈ సినిమా తర్వాత కొంతమంది నిడివి ఎక్కువైనా పర్లేదులే అని ఉంచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే 3 గంటలు పైనే నిడివి ఉన్నా అర్జున్ రెడ్డి అసలు నిడివి దాదాపు 4 గంటలు పైనే. ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పారు కూడా. ఇప్పుడు మరోసారి ఈ సినిమా గురించి సందీప్ వంగా మాట్లాడుతా .. దాదాపు మొదట్లో 4 గంటల 20 నిమిషాల నిడివితో చిత్రాన్ని తీశాం. అయితే, ఎడిటింగులో కొన్ని సీన్లు కట్ చేసి, చివరికి 3 గంటల 45 నిమిషాలకు ఫిక్స్ చేసాం.. అయితే కొన్ని కారణాల వల్ల చిత్రాన్ని మళ్లీ ట్రిమ్ చేసి 3 గంటల 6 నిమిషాల నిడివితో చిత్రాన్ని రిలీజ్ చేశాం అని చెప్పారు. అంతేకాదు 3.45 గంటల రన్ టైంతో కనుక చిత్రాన్ని రిలీజ్ చేసుంటే మరింత హిట్టయ్యేదని.. ఇప్పుడు 3.45 గంటల రన్ టైంతో చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం” అని చెప్పారు. మరి ఇప్పుడు రిలీజ్ చేసినా అంతేక్రేజ్ తెచ్చుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో..

ఇక ఈ సినిమాను హిందీలో సందీప్ వంగానే రీమేక్ చేసారు. షాహిద్ కపూర్-కియారా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా సంచలన విజయం సాధించడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. తమిళ్ లో కూడా విక్రమ్ కుమారుడు ధృవ్ ఈ సినిమాతోనే అరంగేట్రం చేసాడు. అక్కడ కూడా హిట్ అయ్యి ధృవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + fourteen =