నాగచైతన్య, సాయి పల్లవి మచ్ అవైటెడ్ మూవీ తండేల్ ఈ వారంలోనే థియేటర్లలోకి వస్తుంది.ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది.ఇక నిన్న హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. దీనికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా వచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావాల్సివుంది కానీ హెల్త్ ఇష్యూ వల్ల రాలేకయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈవెంట్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ..తండేల్ ట్రైలర్ టీజర్ సాంగ్స్ ఏది చూసి సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది.సాయి పల్లవి, చైతన్య కెమిస్ట్రీ చాలా రియల్ గా అనిపిస్తోంది.బన్నీ వాసు గారి ఆల్ ది వెరీ బెస్ట్. కేడీ సినిమాకి వర్క్ చేసినప్పుడు చైతన్య గారు సెట్స్ కి వచ్చేవారు. అప్పుడే ఆయన నాకు చాలా నచ్చారు. ఆయన బయట వేసుకునే కాస్ట్యుమ్స్ నా సినిమాలకి రిఫరెన్స్ గా చూపిస్తాను. దేవిశ్రీ సర్ మ్యూజిక్ కి హ్యాట్సప్.ప్రేమమ్ సినిమా నుంచి సాయి పల్లవి గారి నటన అంటే ఇష్టం. తను అప్పటికీ ఇప్పటికీ ఒకేలా వున్నారు. చందు నాకు ఆరేళ్ళుగా తెలుసు.ఈ కథ కూడా విన్నాను.అక్కినేని ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా వుంటుంది. సూపర్ హిట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ వుంది. చైతన్య గారి మజిలీ సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చాను.అది పెద్ద హిట్ అయ్యింది.ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
చందు మొండేటి డైరెక్షన్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాను భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ ఈసినిమాను నిర్మించారు.నాగ చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.మరి ఈసినిమా తో నాగ చైతన్య కం బ్యాక్ ఇస్తాడో చూడాలి. ఈనెల 7న తండేల్ తెలుగు తోపాటు హిందీ ,తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: