ఆ డైరెక్టర్ తో పనిచేయాలని ఉంది..!

RX 100 Actress Payal Rajput Shows Interest To Work With Arjun Reddy Director Sandeep Reddy Vanga

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కొంతమంది హీరోయిన్స్ కి కొంతమంది హీరోలతో.. డైరెక్టర్స్ తో పనిచేయాలనే డ్రీమ్ ఉంటుంది. ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కైతే తాను అనుకున్న హీరోతో చేయొచ్చు.. హీరోల సంగతి తెలిసిందే… హీరోయిన్స్ కు కొంచం కష్టమే.. ఎందుకంటే స్టార్ హీరోయిన్ హోదా వస్తేనే తప్పా వారు అనుకున్న హీరోలతో… డైరెక్టర్స్ తో చేయడానికి అవకాశం రాదు. అది కూడా ఒక్కోసారి కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఉపోద్గాతం అంత ఎందుకంటే పాయల్ రాజ్ పుత్ కూడా తన డ్రీమ్ హీరోస్ గురించి చెపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ రాజ్ పుత్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. టాలీవుడ్‌లో రవితేజ, ప్రభాస్ తన ఫేవరేట్ హీరోలని వెల్లడించారు. ఫేవరేట్ హీరోయిన్ తమన్నా అని… ప్రభాస్, విజయ్ దేవరకొండ చిత్రాల్లో నటించాలన్నది కల అని చెప్పింది. అంతేకాదు.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో పనిచేయాలన్నది కూడా తన కోరిక అని తెలిపింది. మరి ప్రభాస్, విజయ్ లతో సినిమా అంటే ఇప్పట్లో కష్టమే.. మరి ముందు ముందు పాయల్ మంచి విజయాలు దక్కించుకొని ఆ రేంజ్ కు ఎదగాలని కోరుకుందాం.

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. గత ఏడాది ‘వెంకీమామ’ సినిమాతో అలరించిన పాయల్.. ఈ ఏడాది రవితేజ ‘డిస్కో రాజా’ సినిమాతో కొత్త ఏడాదిని ప్రారంభించింది. అయితే ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేకపోయింది.
ప్రస్తుతం ప్రనదీప్ దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘5ws’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఐపీఎస్ రోల్ లో ఆమె నటిస్తుంది. మరి ఈ సినిమాతో అయినా పాయల్ కు మంచి బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం…

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here