
ట్యాగ్ · 55 కథనాలు · పేజీ 3


'పాగల్' ట్రైలర్ రిలీజ్

'రౌడీ బాయ్స్' డబ్బింగ్ స్టార్ట్

మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా

ఆగస్ట్ లో "#RC15" ప్రారంభం

దిల్ రాజు మంచి మనసు

క్రేజీ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ
'ఐకాన్' పై దిల్ రాజు క్లారిటీ
'ఐకాన్' కు మంచి స్టోరీ లైన్ ఉంది

దిల్ రాజు మేనల్లుడి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

22 సంవత్సరాల కల తీరింది - దిల్ రాజు
'పాగల్' టీజర్ రిలీజ్ - విశ్వక్ 'వైల్డ్ లవ్'
'షాదీ ముబారక్' టీజర్ రిలీజ్

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ సవాల్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్ పై నరేష్ కుప్పిలి దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర కథానాయకుడు విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా తెరకెక్కిన "పాగల్ "మూవీ ఆగస్ట్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. సిమ్రాన్ చౌదరి , మేఘ లేఖ , మురళీశర్మ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. రధాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "పాగల్ "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం నాడు హైదరాబాద్‌లో జరిగింది.

'పాగల్' ట్రైలర్ రిలీజ్
ఇప్పటి వరకూ కాస్త సీరియస్, మాస్ పాత్రలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు లవర్ బాయ్ పాత్రలో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు నరేష్ కొప్పిలి దర్శకత్వంలో పాగల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ అవ్వగా అవి సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మరోవైపు ఈసినిమా ఈనెల 14 న రిలీజ్ అవుతుండగా సినిమా ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'రౌడీ బాయ్స్' డబ్బింగ్ స్టార్ట్
ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి వారసుడు రాబోతున్న సంగతి తెలిసిందే కదా. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రౌడీబాయ్స్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఈసినిమా డబ్బింగ్ స్టార్ట్ అయిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన ఇన్స్టా ద్వారా తెలిపింది.

మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమాను పట్టాలెక్కించనుండగా రామ్ చరణ్ శంకర్ తో సినిమాను చేయనున్నాడు. అయితే చరణ్-శంకర్ సినిమాను ఎప్పుడో ప్రకటిచినప్పటికీ మధ్యలో లైకా వివాదం రావడంతో ఈసినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదని ఫిక్స్ అయిపోయారు. తమ ఇండియన్ 2 సినిమాను కంప్లీట్ చేసిన తరువాతే శంకర్ వేరే సినిమాను చేయాలన్న కండీషన్ పెట్టింది. ఇక దీనిపై వాదించిన కోర్టు కూడా మీరు మీరు తేల్చుకోవాలని చెప్పినా కూడా అవేమీ వర్కవుట్ కాలేదు. రీసెంట్ గానే ఈసినిమాకు కోర్టు లైన్ క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. శంకర్…

ఆగస్ట్ లో "#RC15" ప్రారంభం
సూపర్ హిట్ “చిరుత “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ , "మగధీర“, రచ్చ “, “నాయక్”, “ఎవడు “, “ధృవ “, “రంగస్థలం ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతమైన తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే రామ్ చరణ్ ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య “మూవీస్ లో నటిస్తున్నారు. ఆ రెండు మూవీస్ షూటింగ్స్ ముగింపు దశలో ఉన్నాయి.

దిల్ రాజు మంచి మనసు
ప్రస్తుతం కరోనాను ఎదుర్కొనేందుకు అందరికీ ఒక్కటే ఆయుధం ముందుంది. అదే వ్యాక్సినేషన్. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ ప్రభుత్వాలు ప్రజలందరికీ సూచిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను చేపడుతున్నారు. ఈ నేపథ్యం లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా తమ సిబ్బంధికి , తన చిత్రాలకు పని చేస్తున్న వారికి తన కార్యాలయంలోనే వ్యాక్సిన్ వేయించారు.

క్రేజీ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ
తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఇటీవలే వకీల్ సాబ్ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇన్నేళ్లు ఇక్కడ తెలుగులో ఎన్నో విజయాలు చవిచూసిన విజయ్ ఇప్పుడు తమిళ్ లో కూడా తన సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఇప్పటికే శంకర్-చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు నిర్మాతగా ఒక సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. అది ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో కూడా తెలీదు.. కానీ అప్పుడే మరో క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.
'ఐకాన్' పై దిల్ రాజు క్లారిటీ
చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా సరే దిల్ రాజు కమిట్ అయ్యాడంటే అది దాదాపు పూర్తయినట్టే. సినిమా కోసం వంద శాతం ఎఫర్ట్ పెట్టే నిర్మాతల్లో ఒకడు కాబట్టే టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గానే వకీల్ సాబ్ సినిమాతో మరోహిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా తన నిర్మాణంలో పెండింగ్ లో ఉన్న ఐకాన్ పై ఇప్పుడు నోరు విప్పాడు దిల్ రాజు.
'ఐకాన్' కు మంచి స్టోరీ లైన్ ఉంది
మొత్తానికి ఏది ఎలా ఉన్నా ఈసారి పరిస్థితులు బన్నీ ఐకాన్ సినిమాకు మాత్రం కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈసినిమా ఇంతవరకూ ఆ అదృష్టానికి నోచుకోలేదు. సినిమాను అయితే ఎప్పుడో ప్రకటించారు కానీ అప్పటినుండి ఎవరు చెప్పినా సినిమా పక్కా ఉంటుంది.. ఉంటుంది అంటున్నారే తప్పా ట్రాక్ లోకి తీసుకురావడంలేదు. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ ఈ సినిమానే చేస్తాడని అప్పుడు అందరూ అనుకున్నారు కానీ.. దాన్ని పక్కన పెట్టి ‘అల వైకుంఠపురములో’ను లైన్లో పెట్టేశాడు. ఈసినిమా తరువాత అయినా చేస్తాడనుకుంటే వెంటనే పుష్ప సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్ - అన్నీ రూమర్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన వకీల్ సాబ్ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటూ దూసుకుపోతుంది. వకీల్ సాబ్ విడుదలను అభిమానులు ఒక పండగలా సెలబ్రెట్ చేసుకున్నారు. కలెక్షన్స్ గురించి నిర్మాతలు పెద్దగా నోరు విప్పట్లేదు కానీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా సినిమా 90కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం.

దిల్ రాజు మేనల్లుడి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
తన సినీ కెరీర్ లో ఎంతో మంది వారసులను తెలుగు తెరకు పరిచయం చేసిన దిల్ రాజు ఇప్పుడు తమ ఇంటి వారసుడిని పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. మేనల్లుడు ఆశిష్ రెడ్డి వెండితెర ఎంట్రీకి రంగం సిద్ధమైంది. 'హుషారు' వంటి యూత్ ఫుల్ చిత్రాన్ని రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష కొనుగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

22 సంవత్సరాల కల తీరింది - దిల్ రాజు
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ , ప్రేక్షకులను అలరిస్తున్న దిల్ రాజు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాతగా రాణిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ భారీ అంచనాలతో , రికార్డ్ స్థాయి లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అగ్ర నిర్మాత దిల్ రాజు పాత్రికేయులతో సమావేశమయ్యారు.
‘షాదీ ముబారక్’చూసి అందరూ ఎంజాయ్ చేస్తారు - దిల్ రాజు
పద్మశ్రీ దర్శకత్వంలో సాగర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘షాదీ ముబారక్’.దృశ్యా రఘునాథ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా...
'పాగల్' టీజర్ రిలీజ్ - విశ్వక్ 'వైల్డ్ లవ్'
ఫలక్ నామా దాస్, హిట్ సినిమాలు సక్సెస్ అవడంతో విశ్వక్ సేన్ కు సినిమాలపై మంచి క్రేజ్ ఏర్పడింది. విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో 'పాగల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.
'షాదీ ముబారక్' టీజర్ రిలీజ్
పద్మశ్రీ దర్శకత్వంలో సాగర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘షాదీ ముబారక్’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇప్ప్పుడు తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.