ఫలక్ నామా దాస్, హిట్ సినిమాలు సక్సెస్ అవడంతో విశ్వక్ సేన్ కు సినిమాలపై మంచి క్రేజ్ ఏర్పడింది. విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. టీజర్ లో లవ్, యాక్షన్, కామెడీ కూడా చూపించగా అందర్నీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు విశ్వక్ మంచి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా టీజర్ లో ఎక్కువగా వినపడింది పదం లవర్, లవర్, లవర్. ఏయ్.. ఎవడ్రా… నా లవర్ ని ఏడిపించింది’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ‘రేయ్.. నా లవర్ ఫేస్ లో హ్యాపీ నెస్ కనిపించడం లేదు. స్ట్రాంగ్ గా కొట్టండి. వైల్డ్ గా కొట్టండి.. అంటూ అడిగి మరీ రౌడీల చేత కొట్టించుకుంటూ వైల్డ్ లవర్ గా కనిపిస్తున్నాడు. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకుంది.
Here’s the Teaser of ‘Mass ka Dass’ @VishwakSenActor #Paagal #PaagalTeaser ▶️ https://t.co/aQirE2qphK
He is #PAAGAL for his LOVE 😍#PaagalOnApril30th@SVC_official @NaresshLee @radhanmusic #Manikandan @Garrybh88 @BekkemVenugopal @luckymediaoff #VS5 #VishwakSen pic.twitter.com/MEK5MMqoPr
— Sri Venkateswara Creations (@SVC_official) February 18, 2021
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా పతాకాలపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏప్రిల్ 30న థియేటర్ లో సందడి చేయనుంది ఈ సినిమా




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: