
ట్యాగ్ · 15 కథనాలు


మరో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్

శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

సార్ మూవీ పై ఆర్ నారాయణ మూర్తి ప్రశంసలు

సార్ మూవీ 3 రోజుల్లో 51 కోట్లు

కాంటెంపరరీ నటుల్లో ధనుష్ టాప్

సార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో తెలుగు డైరెక్టర్ తో ధనుష్ సినిమా?

రెండు దశాబ్దాల ప్రస్థానం..!

ధనుష్ తో థ్రిల్లర్ చేస్తున్నా

టాలీవుడ్ లో బిజీగా ధనుష్

'జగమే తంత్రం' ట్రైలర్ రిలీజ్

ధనుష్-నాగార్జున మూవీ థర్డ్ షెడ్యూల్ లోకి ఎంట్రీ
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఈసినిమాను ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఇంత టైమ్ పట్టింది. గత నెలలోనే ఈసినిమాను పూజాకార్యక్రమాాలతో ప్రారంభించారు.

ధనుష్ 50 మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్
తమిళ్ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం ఎక్కడా తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తూ తన సత్తా చూపిస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో సార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ధనుష్. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని…

ధనుష్ -శేఖర్ కమ్ముల సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
తమిళ హీరో ధనుష్ తన 51వ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చేస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతుంది.ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.రష్మిక మందన్న కథానాయకి గా నటిస్తుంది.ఇక ఇప్పుడు మరింత పవర్ ఆడ్ అయ్యింది.ఈసినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.దాంతో సినిమా క్రేజ్ మరింతగా పెరిగింది.

మరో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ఇంకా హాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తూ సినిమాలను చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే టాలీవుడ్ లోకి సార్ అనే స్ట్రైయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక దీనితోపాటు పలు సినిమాలు చేస్తున్నాడు.

శేఖర్ కమ్ముల-ధనుష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్
తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గానే తెలుగులో స్ట్రైయిట్ గా సార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మొదటి ప్రయత్నంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఈనెల 17వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను అలానే మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ధనుష్ శేఖర్ కమ్ములతో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై కూడా ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఇప్పటివరకూ ధనుష్ పలు సినిమాలతో బిజీగా ఉండటంతో…

సార్ మూవీ పై ఆర్ నారాయణ మూర్తి ప్రశంసలు
వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ మొదటి స్ట్రయిట్ తెలుగు సినిమా కావడంతో ఈసినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఆ అంచనాల కు ఏమాత్రం తగ్గకుండా ఈసినిమా మొదటి షో నుండే మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటివరకూ లవ్ స్టోరీస్ తో అలరించిన వెంకీ మొదటిసారి మెసేజ్ ఒరియెంటెడ్ తో వచ్చాడు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరిగే మోసాల గురించి తెలియచేస్తూ ఈసినిమాను రూపొందించాడు. ఇక ధనుష్ కూడా తన నటనతో ఆకట్టుకన్నాడు. ప్రస్తుతం ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మూడు రోజుల్లో రెండు వెర్షన్స్ లో కలిసి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం…

సార్ మూవీ 3 రోజుల్లో 51 కోట్లు
తమిళ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు సార్ సినిమాతో మరోసారి తన టాలెంట్ ను చూపించాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన సినిమా సార్. తెలుగులో సార్ టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తమిళ్ లో వాతి టైటిల్ తో రిలీజ్ అయింది. ఈసినిమాలో విద్యా సంస్థల్లో జరిగే మోసాల గురించి.. కార్పొరేట్ విద్యా సంస్థల ఆదిపత్యం గురించి ఈసినిమాలో చూపించారు. ఇక ఈసినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ధనుష్ సెటిల్డ్ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.

కాంటెంపరరీ నటుల్లో ధనుష్ టాప్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా మరో రోజులో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను పెంచేశాయి.

సార్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ టాలెండెట్ స్టార్ హీరో ధనుష్ గురించి, తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక తెలుగులో తనకు ఎంత క్రేజ్ ఉందో కూడా తెలిసిందే. ఇప్పటివరకూ తన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ధనుష్ తెలుగులో నటిస్తోన్న తొలి సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

మరో తెలుగు డైరెక్టర్ తో ధనుష్ సినిమా?
తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎవరు ఎవరితో అయినా సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ పద్దతికి అలవాటు పడుతున్నారు. ఈనేపథ్యంలోనే తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఈసినిమా ఇప్పుడు షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా కాకుండా…

రెండు దశాబ్దాల ప్రస్థానం..!
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయి చేస్తాడని తన సినిమాలను చూస్తేనే తెలుస్తుంది. 2002 లో ‘తుల్లు వాదో ఇమ్మాయ్` అనే సినిమాతో కోలీవుడ్ లో నటుడిగా పరిచయం అయ్యాడు ధనుష్. ఇక ఆతరువాత ఇప్పటి వరకూ ఎన్నో పాత్రల్లో నటించాడు. ఇక ధనుష్ తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్నాడు. ఈ ఇరవై ఏళ్లలో ధనుష్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగు సినిమానే చేసేస్తున్నాడు.

ధనుష్ తో థ్రిల్లర్ చేస్తున్నా
కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా లవ్ స్టోరీ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న శేఖర్ కమ్ముల ధనుష్ సినిమా గురించి కూడా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ఇప్పటి వరకూ కూల్ సినిమాలతో అలరించిన శేఖర్ కమ్ముల ధనుష్ తో చేయబోయేది థ్రిల్లర్ మూవీ అని క్లారిటీ ఇచ్చాడు. ఇంకా మల్టీ లింగ్వువల్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నానని, వచ్చే ఏడాది…

టాలీవుడ్ లో బిజీగా ధనుష్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ ద్వారా ధనుష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో ధనుష్ ప్రస్థుహం ఒక , హిందీ , ఒక ఇంగ్లీష్ , రెండు తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. "ఆడుకాలం" , "అసురన్" మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. ధనుష్ నటుడే కాకుండా నిర్మాత , దర్శకుడు , స్క్రీన్ రైటర్ , సింగర్ , లిరిసిస్ట్ కూడా. టాలెంటెడ్ హీరో ధనుష్ ఇప్పుడు కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

'జగమే తంత్రం'... 190 దేశాల్లో, 17 భాషల్లో
ఇప్పటికేధనుష్ నటించిన కర్ణన్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి విదితమే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో 'జగమే తంతిరమ్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో జగమే తంత్రం పేరుతో ఈసినిమా వస్తుంది. ఇక కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఫైనల్ గా ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'నెట్ ఫ్లిక్స్' లో జూన్ 18న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

'జగమే తంత్రం' ట్రైలర్ రిలీజ్
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ ప్రధాన పాత్రలో 'జగమే తంతిరమ్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో జగమే తంత్రం పేరుతో ఈసినిమా వస్తుంది. ఇక పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా గత ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆమధ్య థియేటర్లు ఓపెన్ చేసినప్పుడైనా రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ అదీ అవ్వలేదు. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ తో మళ్లీ థియేటర్లు మళ్లీ మూతపడ్డాయి. ఇక దీనితో ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'నెట్ ఫ్లిక్స్' లో జూన్ 18న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే అనౌన్స్ చేశారు.