
ట్యాగ్ · 85 కథనాలు · పేజీ 4


రీ రిలీజ్‌కు సిద్ధమైన బాలకృష్ణ 'భైరవ ద్వీపం'

జైలర్ కు బాలకృష్ణ ను అనుకున్నారట కానీ ...

భగవంత్ కేసరి మేనియా కు సిద్దం

క్లైమాక్స్ లో బాలయ్య భగవంత్ కేసరి

మీకు నచ్చిన మాసీ టీజర్?

హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో భగవంత్ కేసరి

రాముని గా వెండితెరపై అలరించిన హీరోలు

టాప్ ట్రెండింగ్ భగవంత్ కేసరి లో టీజర్

నందమూరి బాలకృష్ణ నటజీవితానికి 49 ఏళ్ళు పూర్తి
నటసింహ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ పరిశ్రమలో 49 గ్లోరియస్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. నటుడిగా నేటితో 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ తన పుట్టిన రోజైన జూన్ 10కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఆగస్టు 30ని కూడా అంతే గొప్పగా చూస్తారు. ఎందుకంటే..? 'తాతమ్మకల' అనే సినిమాతో బాలకృష్ణ తొలిసారిగా తన 14వ ఏట సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ బాలకృష్ణ దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా.. కథానాయకుడు, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, ఆదిత్య 369, భైరవద్వీపం, రౌడీ ఇనస్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్…

భగవంత్ కేసరి నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో రానుంది
వీరసింహారెడ్డి తరువాత నందమూరి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమా ఫై అంచనాలు పెంచేసింది.ఇక ఇప్పుడు సాంగ్స్ ను రిలీజ్ చేసే పనిలో పడింది చిత్ర బృదం అందులో భాగంగా వచ్చే నెల 1న ఈసినిమా నుండి గణేష్ అంతేమ్ అనే సాంగ్ విడుదలకానుంది.ఈసాంగ్ లో బాలకృష్ణ,శ్రీ లీల వేసే స్టెప్పులు హైలైట్ కానున్నాయి అంతే కాదు ఈ సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుందని తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడని టాక్.

రీ రిలీజ్‌కు సిద్ధమైన బాలకృష్ణ 'భైరవ ద్వీపం'
టాలీవుడ్‌లో రీసెంట్‌గా రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన అగ్ర హీరోల సినిమాలను మళ్ళీ విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ ‘భైరవ ద్వీపం’ సినిమా చేరింది. కాగా 1974లో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ.. సినీ పరిశ్రమలో 50 గ్లోరియస్ ఇయర్స్ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, ఈ తరం ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి 'భైరవ ద్వీపం' సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. ‘భైరవద్వీపం’ చిత్రాన్ని దాదాపు రెండు దశాబ్దాల…

భగవంత్ కేసరి సెట్‌లో సందడి చేసిన నందమూరి మోక్షజ్ఞ
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ గురించి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మోక్షజ్ఞ సినీ అరంగేట్రం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇంతవరకూ ఆయన ఎంట్రీ గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాగా ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మోక్షజ్ఞ తెరంగేట్రం చేయొచ్చనే టాక్ నడుస్తోంది. దీనికితోడు ఈ మధ్య మోక్షజ్ఞ తండ్రి సినిమాల షూటింగ్స్ మరియు సెట్స్‌ను తరచుగా సందర్శిస్తున్నాడు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. ఇక బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో…

ఇస్మార్ట్ శంకర్‌తో రామ్ నాకొక సవాల్ విసిరాడు - నందమూరి బాలకృష్ణ
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో రామ్ తనకు ఒక సవాల్ విసిరాడని, దానిని తాను అందుకోవాల్సి ఉందని పేర్కొన్నారు టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ. శనివారం ఆయన హైదరాబాద్‌లో జరిగిన ‘స్కంద-ది అటాకర్’ ప్రీరిలీజ్ థండర్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘స్కంద’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న బాలకృష్ణ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. అలాగే ఇటీవలి ‘చంద్రయాన్ 3’ విజయంపై ఓ ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేసి ఇస్రో టీమ్‌కు అభినందనలు తెలిపారు. ఇక కార్యక్రమంలో భాగంగా హీరో రామ్…

బాలకృష్ణ భగవంత్ కేసరి మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం
గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరొందిన టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'భగవంత్ కేసరి'. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ తో చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి. నందమూరి ఫ్యాన్స్ నుంచే కాకుండా ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా దీనిపై టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అందులో ముఖ్యంగా బాలకృష్ణ తెలంగాణ యాసలో పలికిన డైలాగులు అభిమానులను బాగా అలరించాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా…

బ్రహ్మానందం తనయుడి వివాహం.. హాజరైన పలువురు సినీ ప్రముఖులు
టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం (ఆగస్టు 18, 2023) రాత్రి ఘనంగా జరిగింది. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ వివాహమాడారు. తల్లిదండ్రులు, అతిథుల సమక్షంలో ఏడు అడుగులు నడిచి ఐశ్వర్య, సిద్ధార్థ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వద్ద గల అన్వయ కన్వెన్షన్స్‌లో రాత్రి 10.45 గంటలకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అగ్రనటులు నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదితరులు విచ్చేసి సందడి…

జైలర్ కు బాలకృష్ణ ను అనుకున్నారట కానీ ...
సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా రోజుల తరువాత బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపిస్తున్నాడు.ఆయన నటించిన లేటెస్ట్ మూవీ జైలర్.మొన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ మౌత్ టాక్ తో అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది.ఒక్క తమిళనాడు లోనే కాదు మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది.మాస్ ఎంటర్టైనర్ గా నెల్సన్ దిలీప్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించాడు.

భగవంత్ కేసరి మేనియా కు సిద్దం
ఈఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గానే ఓభారీ సెట్ లో భారీస్థాయిలో ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు.

భారీ సెట్ లో భగవంత్ కేసరి భారీ సాంగ్
ఈఏడాది ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ఆందరూ ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక యూనిక్ కాన్సెప్ట్ తో హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ఈసినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని క్యారెక్టర్‌లో అనిల్ రావిపూడి చూపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ పవర్ ఫుల్ ప్రజెన్స్, తెలంగాణ యాసలో డైలాగ్‌లని చెప్పడం ఎంతగానో అలరించింది

ఎవర్ గ్రీన్ క్లాసిన్ భైరవద్వీపం రీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. రీ రిలీజ్ ల సందడి ఎక్కువైంది. స్టార్ హీరోల బర్త్ డేలకు.. స్పెషల్ అకేషన్స్ కు సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు సినిమాలు రీ రిలీజ్ అయి సందడి చేశాయి. ఇక ఇప్పుడు మరో ఎవర్ గ్రీన్ క్లాసిక్ రీ రిలీజ్ కు సిద్దమైంది. ఆ సినిమా మరేదో కాదు బాలయ్య సినీ కెరీర్ లో ఎప్పటికీ గొప్ప సినిమాగా మిగిలిపోయే సినిమా భైరవద్వీపం.

క్లైమాక్స్ లో బాలయ్య భగవంత్ కేసరి
నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మాసీ టీజర్?
సమ్మర్ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటివరకూ పలు సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక రిలీజ్ కు పలు సినిమాలు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. వాటిలో అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న భోళాశంకర్ ఇంకా భగవంత్ కేసరి సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో అలానే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్, భగవంత్ కేసరి సినిమాలతో వచ్చేస్తున్నారు. మరవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న హ్యాట్రిక్…

మహేష్ ,ప్రభాస్ నాకంటే పెద్ద హీరోలు - పవన్ కళ్యాణ్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న ముమ్మడివరంలో జరిగిన వారాహి విజయయాత్రలో సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయ నేపథ్యంలో సాగుతున్న సభలో సందర్భానుసారం మిగితా తెలుగు సినిమా స్టార్ హీరోల గురించి ప్రస్తావించారు.మహేష్ బాబు గారు,ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరోలు నేను వేరే రాష్ట్రాల్లో,దేశాల్లో తెలియకపోవచ్చు కానీ వారు తెలుసు.నాకన్నా ఎక్కువ పారితోషకం తీసుకుంటారు.చిరంజీవిగారు,బాలకృష్ణ గారు,జూనియర్ ఎన్టీఆర్ గారు,రామ్ చరణ్ గారు,అల్లు అర్జున్ గారు వీరంత నాకు ఇష్టం.ఎన్టీఆర్,చరణ్ గ్లోబల్ స్టార్స్ అయిపోయారు.ఇవి చెప్పడానికి నాకు ఎలాంటి ఇగో లేదని పవన్ అన్నారు.అంతేకాదు రాజకీయం,సినిమా ఒక్కటి కాదని…

బాలయ్య పాటతో అదరగొట్టిన కాజల్, శ్రీలీల
నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇక ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను రిలీజ్ చేయగా.. ఆ తర్వాత ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్న శ్రీలీల లుక్‌ని కూడా ఆమె బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్‌గా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ వదిలారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉన్నారు.

హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో భగవంత్ కేసరి
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్లను అందుకోవడంతో బాలయ్య ఫ్యాన్స్ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి బాలకృష్ణ పుట్టినరోజు కు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా టీజర్ రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈసినిమాతో హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయానికి వచ్చేశారు.

20 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న భగవంత్ కేసరి టీజర్
ఈఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు అనిల్ రావిపూడి ఇంతవరకూ సక్సెస్ లే కొట్టాడు.. దీంతో ఈసినిమాతో బాలకృష్ణ కు హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి.

రాముని గా వెండితెరపై అలరించిన హీరోలు
కాలం ఎంత మారుతున్నాా కొన్ని కథలలో నిజం మాత్రం మారదు. ముఖ్యంగా ఇతిహాసాలు మహాభారతం, రామాయణం లాంటి కావ్యాలు మాత్రం ఎప్పటికీ అలానే నిలిచిపోయేవి. తరాలు మారినా కూడా మార్చడానికి వీలులేని స్పూర్తి కలిగించే కావ్యాలు అవి. పూర్వికులు విన్నారు.. మనం వింటున్నాం.. భవిష్యత్తు తరాలవారు కూడా వింటారు. ఇక రామాయణం మీద ఇప్పటికే వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కథ ఒకటే అయినా దానికి ఆవిష్కరించే వారి పద్దతి ఒక్కోరకంగా ఉంటుంది. త్వరలో ఇదే కథతో ప్రభాస్ ఆదిపురుష్ తో రాబోతున్నాడు. ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో చూస్తూనే ఉన్నాం. ఇంకా రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ వెండితెరపై…

శ్రీ లీల బర్త్ డే- ఫస్ట్ లుక్ పోస్టర్ల సందడి
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అన్న తేడా లేకుండా అందరితో సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం కెరీర్ పీక్స్ లో ఉంది. రామ్ పోతినేని, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలో, బాలకృష్ణ సినిమాలో ఇంకా విజయ్ దేవరకొండతో ఇలా వరుసపెట్టి సినిమాలు చేస్తుంది.

టాప్ ట్రెండింగ్ భగవంత్ కేసరి లో టీజర్
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే ఈసినిమా మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్.